Emergency Gadgets
Emergency Gadgets : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక వైపు, మన సైనికులు సాయుధ దళాల సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉన్నారు. ఉగ్రవాదానికి దీటుగా బదులిస్తున్నారు. మరోవైపు, ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండాలని భారత పౌరులకు కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇలాంటి పరిస్థితిలో మీరు కొన్ని ప్రత్యేక గాడ్జెట్‌లను మీతో ఉంచుకోవాలి. మీకు అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన గాడ్జెట్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పవర్ బ్యాంక్ :
అత్యవసర సమయాల్లో విద్యుత్ కోతలు ఎదురవుతాయనే భయం ఉంటుంది. ఈ సమయంలో, మీ మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఛార్జ్ చేసేందుకు పవర్ బ్యాంక్ మీకు చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితిలో, మీతో పవర్ బ్యాంక్ దగ్గర ఉంచుకోండి.
రేడియో :
మీ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ షట్‌డౌన్ అయ్యే పరిస్థితి ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం మీరు ముందుగానే మీ వద్ద ఒక రేడియో ఉంచుకోవాలి. మీరు లేటెస్ట్ న్యూస్, ప్రభుత్వ సూచనలను సులభంగా వినవచ్చు.
గుడ్ క్వాలిటీ టార్చ్ :
చీకటిలో లేదా ఏదైనా అత్యవసర పరిస్థితిలో వెలుతురు కోసం ఎల్లప్పుడూ గుడ్ క్వాలిటీ గల టార్చ్‌ను మీతో ఉంచుకోండి.
ఫస్ట్ ఎయిడ్ కిట్ :
ఏదైనా గాయం లేదా అత్యవసర పరిస్థితిలో ఫస్ట్ ఎయిడ్ కిట్ చాలా ముఖ్యమైనది. మీరు ఇందులో బ్యాండేజీలు, యాంటిసెప్టిక్ క్రీమ్, నొప్పి నివారణ మందులు మొదలైనవి ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు ఒక బాక్సును రెడీగా ఉంచుకోవాలి.
వాటర్ ఫ్యూరిఫైయర్ :
ఇంట్లో తగినంత నీరు ఉంచుకోండి. నీటిని శుభ్రపరిచేందుకు పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ కలిగి ఉండాలి. ఈ 5 గాడ్జెట్‌లను మీ ఇంట్లో ఉంచుకుంటే.. ఏదైనా అత్యవసర పరిస్థితికి వినియోగించుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల భద్రతతో పాటు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా సమాచారం అందించవచ్చు.