PIB Fact Check : భారత్-పాక్ ఉద్రిక్తత.. ఫోన్ లొకేషన్ ట్రాక్ చేస్తున్న డ్రోన్లు.. అంతా ఫేక్.. భారతీయులు నమ్మొద్దు.. ప్రభుత్వం అలర్ట్..!

PIB Fact Check : భారతీయ పౌరుల ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డ్రోన్ల దాడి నివారించేందుకు సర్వీసులు ఆఫ్ చేయాలంటూ ఒక ఫేక్ అడ్వైజరీ వైరల్ అవుతోంది.

PIB Fact Check : భారత్-పాక్ ఉద్రిక్తత.. ఫోన్ లొకేషన్ ట్రాక్ చేస్తున్న డ్రోన్లు.. అంతా ఫేక్.. భారతీయులు నమ్మొద్దు.. ప్రభుత్వం అలర్ట్..!

PIB Fact Check

Updated On : May 10, 2025 / 6:04 PM IST

PIB Fact Check : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ పౌరులను భయాభ్రాంతులకు గురిచేసే అనేక పుకార్లు వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ హెచ్చరిక అంటూ ఒక అడ్వైజరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Lava Agni 3 : వారెవ్వా.. డిస్కౌంట్ అదిరింది.. అతి చౌకైన ధరకే డ్యూయల్ స్క్రీన్ లావా అగ్ని 3 కొనేసుకోండి.. డోంట్ మిస్!

పాక్ డ్రోన్లతో దాడులు చేసేందుకు భారతీయ పౌరుల ఫోన్ లొకేషన్లను ట్రాక్ చేస్తోందని, వెంటనే వినియోగదారులు తమ ఫోన్లలో లొకేషన్ సెట్టింగ్ ఆఫ్ చేసుకోవాలంటూ ఒక ఫేక్ అడ్వైజరీ వైరల్‌‌గా మారింది.

మొబైల్ ఫోన్ లొకేషన్ల ద్వారా అధిక జనాభా సాంద్రత ఉన్న ప్రాంతాలను గుర్తించేందుు పాక్ డ్రోన్లను ఉపయోగిస్తోందని అడ్వైజరీ పేర్కొంది. అయితే, ఈ అడ్వైజరీ ఫేక్ అంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఎక్స్ వేదికగా ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అంతా ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. “భారతీయ పౌరులు తమ ఫోన్‌లలో లొకేషన్ సేవలను వెంటనే ఆపివేయాలని హెచ్చరిస్తూ ఒక అడ్వైజరీ జారీ అయినట్టుగా క్లెయిమ్ చేస్తోంది. #PIBFactCheck” “ఇది ఫేక్ అడ్వైజరీ. GoI ఇలాంటి అడ్వైజరీని జారీ చేయలేదు.” అని పేర్కొంది.

“అందరికీ నమస్కారం.. ఒక ముఖ్యమైన అడ్వైజరీతో అధికారిక ఇమెయిల్ వచ్చింది. దయచేసి మీ ఫోన్‌లోని లొకేషన్ సర్వీసులను వెంటనే ఆపివేయండి. అధిక జనాభా ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి పాక్ డ్రోన్‌లను ఉపయోగిస్తుందని మా దృష్టికి వచ్చింది” అని ఫేక్ మెసేజ్ వైరల్ చేస్తున్నారు.

ముఖ్యంగా సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఈ మెసేజ్ నిజమని నమ్మారు. కానీ, కేంద్ర ప్రభుత్వం పౌరులు ఇలాంటి పుకార్లకు భయపడవద్దని కోరుతోంది.

ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్‌ భారతీయ ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాపిచేస్తోందని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

పాకిస్తాన్ రాబోయే రోజుల్లో తప్పుదారి పట్టించే సోషల్ మీడియా పోస్టులను మరింత వ్యాప్తిచేసే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. “రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ మరింత నిండిపోయే ప్రమాదం ఉంది.

ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా భారత సాయుధ దళాలకు సంబంధించిన సందేహాస్పద కంటెంట్ లేదా యుద్ధ పరిస్థితికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని మీరు ఎదుర్కొంటే, దానిని #PIBFactCheckకి రిపోర్టు చేయండి” అని పోస్ట్‌ షేర్ చేసింది.

మీరు ఏదైనా అనుమానాస్పద కంటెంట్‌ను చూసినట్లయితే.. వినియోగదారులు +91 8799711259 నంబర్‌కు వాట్సాప్ ద్వారా లేదా factcheck@pib.gov.inకు ఇమెయిల్ చేయడం ద్వారా నేరుగా నివేదించాలని సూచించారు.

Read Also : Jio Offers : జియో యూజర్లకు పండగే.. ఈ ప్లాన్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 200GB హైస్పీడ్ డేటా, ఫ్రీగా OTT బెనిఫిట్స్!

భారతీయ పౌరులు ప్రశాంతంగా ఉండాలని, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని, కొత్త అప్‌డేట్స్ కోసం అధికారిక ప్రభుత్వ ఛానెల్‌లను మాత్రమే ఫాలో చేయాలని కోరింది.