Kia Concept EV9 : కియా ఎలక్ట్రిక్ SUV కారు వస్తోంది..!

ముఖ సౌత్ కొరియా కార్ మేకర్ కియా ఎలక్ట్రిక్ (Kia) నుంచి ఎలక్ట్రిక్ SUV కారు వస్తోంది. ప్రపంచ మార్కెట్లోకి న్యూ జనరేషన్ EV9 ఎంట్రీ ఇవ్వనుంది.

Kia Teases Concept Ev9 Some More, Full Debut Coming At La Auto Show

Kia Concept EV9 : ప్రముఖ సౌత్ కొరియన్ కార్ల మేకర్ కియా ఎలక్ట్రిక్ (Kia) నుంచి ఎలక్ట్రిక్ SUV కారు వస్తోంది. ప్రపంచ మార్కెట్లోకి న్యూ జనరేషన్ EV9 ఎంట్రీ ఇవ్వనుంది. నవంబర్ 17న లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఆటో షో (LA Auto Show)లో కియా ఎలక్ట్రిక్ కారు లాంచ్ కానుంది. లాంచింగ్ ముందు కియా కంపెనీ అధికారికంగా కాన్సెప్ట్ EV9 టీజర్ రిలీజ్ చేసింది. ఈ SUV ఎలక్ట్రిక్ కారుకు వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ ఉంది. కియా కొత్త EV9 డిజైన్ వెరీ టెండ్రీ లుక్ తో అదరగొడుతోంది. EV కారు ఫ్లాట్ రూఫ్ లైన్, బిగ్ వీల్ ఆర్చ్, స్లిమ్ LED DRL సెక్షన్, ఫ్రంట్ గ్రిల్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.

కియా కొత్త కాన్సెప్ట్ EV9 బ్రాండ్ కారు ఇతర EV కార్ల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. అమెరికాలో ఈ కియా ఎలక్ట్రిక్ కారు బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ కారు SUV 400V, 800V ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ SUV కారును ఫాస్ట్ ఛార్జర్ సాయంతో చార్జ్ చేయాల్సి ఉంటుంది. EV6 మాదిరిగా 5 నిమిషాల్లోనే (112 కిలోమీటర్లు) ఛార్జ్ అవుతుంది.

18 నిమిషాలు చార్జ్ చేస్తే.. 330 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదని కియా కంపెనీ వెల్లడించింది. కియా ఎలక్ట్రిక్ SUV కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 500కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. 77.4Kwh బ్యాటరీ సామర్థ్యంతో రన్ అవుతుంది. కారు ధర రూ.44 లక్షలుగా ఉంటుందని అంచనా. భారత మార్కెట్లోకి ఈ కియా ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు వస్తుందో లేదో క్లారిటీ లేదు.
Read Also : China Snowfall : చైనాలో 116 ఏళ్లలో అత్యధిక హిమపాతం ఇదే!