Lava Agni 3 with iPhone-like Action button, secondary display launched in India
Lava Agni 3 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ భారతీయ స్మార్ట్‌ఫోన్ మేకర్ లావా నుంచి సరికొత్త మిడ్-లెవల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అదే.. లావా అగ్ని 3 ఫోన్.. ఈ లావా ఫోన్ రూ. 20,999 ప్రారంభ ధరతో భారత మార్కెట్లో లాంచ్ అయింది.
Read Also : Apple Retail Stores : ఢిల్లీ, ముంబై తర్వాత భారత్‌లో మరో 4 ఆపిల్ రిటైల్ స్టోర్లు రాబోతున్నాయి..!
ఈ లావా ఫోన్ ఐఫోన్ లాంటి యాక్షన్ బటన్‌ను కలిగిన మొదటి భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కూడా. లావా అగ్ని 3 మరో ప్రత్యేకమైన ఫీచర్ డ్యూయల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. నోటిఫికేషన్‌లు, వెదర్ మరిన్నింటితో బ్యాక్ ప్యానెల్‌లోని కెమెరా మాడ్యూల్‌లో అదనపు డిస్‌ప్లే కలిగి ఉంది. లావా అగ్ని 3 ఫోన్ వివరాలతో పాటు భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.
లావా అగ్ని 3 ఫోన్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో లావా అగ్ని 3 లాంచ్ ధర రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ 8జీబీ ర్యామ్‌తో పాటు 128జీబీ, 256జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లను రిలీజ్ చేసింది. ఈ సేల్ అక్టోబర్ 9న లైవ్ కానుంది. అమెజాన్‌లో ఈరోజు నుంచి ప్రీ-బుకింగ్ అందుబాటులో ఉంటుంది. లావా 8జీబీ+128జీబీ వేరియంట్‌ను ఛార్జర్ లేకుండా రూ. 20,999కు అందిస్తుంది. అదే ఛార్జర్‌తో లావా ఫోన్ ధర రూ. 22,999కి అందిస్తోంది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.24,999కి అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌తో ప్రతి మోడల్‌కు రూ. 2వేలు తగ్గింపు, బాక్స్‌లో ఛార్జర్ లేని వేరియంట్‌పై రూ. వెయ్యి తగ్గింపు పొందవచ్చు.
లావా అగ్ని 3 స్పెషిఫికేషన్లు :
భారతీయ స్మార్ట్‌ఫోన్‌లలో లావా అగ్ని 3 ఫోన్‌తో ఐఫోన్ మోడల్ యాక్షన్ బటన్‌ను తీసుకొచ్చింది. వినియోగదారులు షార్ట్‌కట్స్ కస్టమైజ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ లావా ఫోన్ గ్లాస్ బ్యాక్ లగ్జరీ మోడ్ అందిస్తుంది. ఈ అత్యాధునిక డిజైన్ స్టైల్, ఫంక్షనాలిటీతో లావా అగ్ని 3ని భారతీయ మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలిపింది. ఈ లావా ఫోన్ ప్రిస్టిన్ వైట్, హీథర్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
లావా అగ్ని 3 డిస్‌ప్లే కర్వడ్ డిజైన్‌తో ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో రెండు అమోల్డ్ స్క్రీన్‌లు ఉన్నాయి. 6.78-అంగుళాల 120Hz ఫ్రంట్ డిస్‌ప్లే, బ్యాక్ సైడ్ 1.74-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే, 120Hz కర్వ్డ్ డిస్‌ప్లేతో 1.5k రిజల్యూషన్ కలిగి ఉంది. మెరుగైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది. హుడ్ కింద, లావా 3, మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1, ఐక్యూ Z9s, మోటో ఎడ్జ్ 50 నియోతో పోటీపడుతుంది. 770,000 Antutu స్కోర్‌తో, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ టాప్ మిడ్-రేంజ్ పర్ఫార్మెన్స్ విభాగంలోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. అగ్ని సిరీస్ మూడో మోడల్ బ్లోట్‌వేర్-రహిత యూఐని కూడా అందిస్తుంది.
లావా అగ్ని 3 క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ (ఓఐఎస్), 8ఎంపీ అల్ట్రావైడ్, 8ఎంపీ టెలిఫోటో (3ఎక్స్ జూమ్), 16ఎంపీ ఫ్రంట్ కెమెరా పర్ఫెక్ట్, ఫోన్ 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.