Lost Your Phone : మీ ఫోన్ పోయిందా? పర్సనల్ డేటా జాగ్రత్త.. వెంటనే ఈ 5 విషయాలు తప్పక చేయండి..!
Lost Your Phone : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్లలోనే ఆన్‌లైన్ పేమెంట్లు చేస్తున్నారు. ముఖ్యమైన డేటాను స్టోర్ చేయడం నుంచి రోజువారీ జీవితంలో అవసరమైన ఏదైనా, అన్నీఫోన్లలోనే ఉంటున్నాయి. అలాంటి విలువైన ఫోన్ పొగొట్టుకుంటే.. మీ డేటా రిస్క్‌లో పడినట్టే..

Lost your phone in a cab_ Do these 5 things immediately to minimize the damage
Lost Your Phone : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్లలోనే ఆన్‌లైన్ పేమెంట్లు చేస్తున్నారు. ముఖ్యమైన డేటాను స్టోర్ చేయడం నుంచి రోజువారీ జీవితంలో అవసరమైన ఏదైనా, అన్నీఫోన్లలోనే ఉంటున్నాయి. అలాంటి విలువైన ఫోన్ పొగొట్టుకుంటే.. మీ డేటా రిస్క్‌లో పడినట్టే.. మనలో చాలా మంది క్యాబ్‌లలో ప్రతిరోజూ ప్రయాణిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో తమ ఫోన్‌లను మరచిపోతుంటారు. మీరు క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నట్లయితే.. డేటా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు మీరు కొన్ని విషయాలను తప్పక గుర్తించుకోండి.
1. మీ డేటాను రిమోట్‌గా డిలీట్ చేయండి :
మీ ఫోన్ డేటాను కోల్పోకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ఫోన్లో డేటా చాలా విలువైనది. అది తప్పుడు చేతుల్లో పడితే దుర్వినియోగం కావచ్చు. శుభవార్త ఏమిటంటే ఈ డేటాను డివైజ్ నుంచి రిమోట్‌గా తొలగించవచ్చు. iPhone యూజర్ల కోసం, మీరు iCloud.comని విజిట్ చేయడం ద్వారా డివైజ్ ఎక్కడ ఉందో సులభంగా కనుగొనవచ్చు. ఎంచుకున్న డివైజ్ నుంచి డేటాను వెంటనే తొలగించవచ్చు. డివైజ్ లింక్ చేసిన Google అకౌంట్ కలిగిన Android ఫోన్‌ల కోసం Find My Device అనే ఫీచర్ ఆటోమాటిక్‌గా ఆన్ అవుతుంది. మీ ఫోన్లో డేటాను డిలీట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగించవచ్చు. ఫీచర్‌ని ఉపయోగించడానికి android.com/find విజిట్ చేయండి. సందర్శించండి .
2. మీ ఫోన్‌ని ట్రాక్ చేయండి :
ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం Find My Device, Apple iPhoneల కోసం Find My iPhone ఫీచర్ వంటి ఫీచర్‌లతో, మీ ఫోన్‌ని ట్రాక్ చేయడం సులభం. మీరు డివైజ్ ఆన్‌లైన్‌లో ఉంటే.. మాత్రమే దాని లొకేషన్ చూడవచ్చు. మీ డివైజ్ ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లయితే.. డివైజ్ నిలిపివేయడానికి ముందు దాని ఆఖరి లొకేషన్ కనిపిస్తుంది.

Lost your phone in a cab_ Do these 5 things immediately to minimize the damage
3. మీ బ్యాంకింగ్ డేటాను ప్రొటెక్ట్ చేయండి :
అన్ని నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్‌లలో సెక్యూరిటీ పిన్‌లు మొదలైనవి ఉన్నప్పటికీ.. మీరు వాటిపై ఆధారపడకూడదు. మీ ఫోన్‌ని కలిగిన ఎవరైనా ఇప్పటికీ మీ పర్సనల్ డేటాను ఉపయోగించవచ్చు. మీ అకౌంట్లను పొందవచ్చు. మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లన్నింటినీ మార్చుకోవడం మంచిది. షాపింగ్ మొదలైనప్పుడు మీ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు ఆటోమాటిక్‌గా సేవ్ చేయడం కుదరదు. అలాగే, మీరు మీ ఫోన్‌లో ఎక్కడైనా ATM పిన్‌లు, నెట్ బ్యాంకింగ్ పాస్‌కోడ్‌లు మొదలైన సున్నితమైన డేటాను స్టోర్ చేస్తే మీ బ్యాంక్‌కి కాల్ చేసి వారిని అలర్ట్ చేయండి.
4. సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను మార్చుకోండి :
మీ ఫోన్ ఎవరి వద్ద ఉందో, వారు మీకు ఎలా హాని కలిగించే ప్రయత్నం చేస్తారో మీకు ఎప్పటికీ తెలియదు. సోషల్ మీడియాలో ఒకరి గుర్తింపును తారుమారు చేసేందుకు, స్కామ్‌లకు పాల్పడుతున్నారు. అందువల్ల, మీ అన్ని సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడూ మారుస్తు ఉండాలి. ఆ రిస్క్ నుంచి సురక్షితంగా ఉండటానికి మీరు అన్ని డివైజ్‌ల నుంచి లాగ్ అవుట్ అయ్యేలా చూసుకోండి.
5. మీ SIM కార్డ్‌ని బ్లాక్ చేయండి :
వివిధ లావాదేవీలకు OTP వెరిఫికేషన్ చాలా అవసరం. అందుకే మీ ఫోన్‌కు OTPలు వస్తాయి. అప్పుడు మరొకరి చేతుల్లో మీ డేటా పడకుండా ఉండాలంటే వెంటనే మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు కాల్ చేసి.. వీలైనంత త్వరగా మీ SIM కార్డ్‌ని బ్లాక్ చేయండి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..