MacBook Air M3 Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం3 ధరలు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

MacBook Air M3 Price Cut : లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ M3, పాత మోడళ్లు తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

MacBook Air M3 Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం3 ధరలు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

MacBook Air M3 and MacBook Air M2 price cut

Updated On : November 27, 2024 / 11:38 PM IST

MacBook Air M3 Price Cut : ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 14 మరిన్ని వంటి అనేక పాపులర్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కానీ, తక్కువ ధర వద్ద మ్యాక్‌బుక్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్న యూజర్లకు ఇదే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. లేటెస్ట్ మ్యాక్‌బుక్ ఎయిర్ M3, పాత మోడళ్లు తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గిన మ్యాక్‌బుక్ ఎయిర్ M3 ధర :
13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ M3 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,07,990 ప్రారంభ ధరతో జాబితా అయింది. ఈ ల్యాప్‌టాప్ భారత మార్కెట్లో ధర రూ. 1,14,900కి ప్రారంభమైంది. వినియోగదారులు ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 6,910 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 10వేల డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

మీరు ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేస్తే.. Air M3 మోడల్‌ను రూ.97,990 ధరతో కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో ఎయిర్ ఎం3 డీల్‌ని చెక్ చేస్తే.. మీరు ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 20వేల డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా అసలు ధర కూడా తగ్గుతుంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ M2 ధర తగ్గింపు :
మ్యాక్‌బుక్ ఎయిర్ M2 మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ కూడా ఇస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూ. 73,990కి జాబితా అయింది. రీకాల్ కోసం మ్యాక్‌బుక్ ఎయిర్ M2 భారత మార్కెట్లో ధర రూ. 1,19,900కి ప్రారంభమైంది. దీని ప్రకారం.. రూ. 45,910 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

మ్యాక్‌బుక్ ఎయిర్ M3 మోడల్‌లా కాకుండా ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల తగ్గింపును మాత్రమే అందిస్తోంది. కానీ, ప్రభావవంతంగా ధరను రూ.68,990కి తగ్గిస్తుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M3 వెర్షన్‌తో పోలిస్తే.. తక్కువ బడ్జెట్ ఉన్నవారికి బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

Read Also : BMW Cars Prices : కొత్త కారు కోసం చూస్తున్నారా? వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు.. ఎందుకంటే?