NEET UG Counselling : మహారాష్ట్ర నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. గడువు తేదీ, ముఖ్య వివరాలివే..!

NEET UG Counselling : ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఫారమ్‌ను ప్రొవిజనల్ అప్రూవ్ చేయడానికి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి. అవసరమైన రుసుమును చెల్లించిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.

Maharashtra NEET UG Counselling 2024 ( Image Source : Google )

NEET UG Counselling : మహారాష్ట్ర నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024.. రాష్ట్ర సాధారణ ప్రవేశ పరీక్ష (CET) సెల్ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్ఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎమ్ఎస్ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య, ఇతర వైద్య కోర్సులలో రిజిస్టర్ చేయడానికి మహారాష్ట్ర నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

Read Also : Mark Zuckerberg : మెటా సీఈఓ మరుపురాని గిఫ్ట్.. పెరట్లో ఏకంగా భార్య ప్రిస్సిల్లా శిల్పం.. ప్రేమంటే ఇదేగా..!

రాష్ట్రంలోని డెంటల్ కాలేజీలు, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024లో ఉత్తీర్ణత సాధించిన వారు అధికారిక వెబ్‌సైట్ (cetcell.mahacet.org)ని విజిట్ చేయడం ద్వారా సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్ (CAP) 2024 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు సమర్పణకు ఆగస్టు 23 చివరి తేదీ. “ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్ఎస్, బీహెచ్ఎమ్ఎస్, బీయూఎమ్ఎస్, బీపీటీహెచ్/బీఓటీహెచ్, బీఏఎస్ఎల్‌పీ, బీ(పీఅండ్ఓ), అలాగే ఆయుష్ కోర్సుల కోసం నెక్స్ట్ సీఏపీ రౌండ్‌ల షెడ్యూల్‌ను నిర్ణీత సమయంలో ప్రకటిస్తామని సెల్ పేర్కొంది.

కౌన్సెలింగ్ ప్రక్రియకు మార్గదర్శకాలు :
రిజిస్ట్రేషన్ సబ్మిషన్ :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఫారమ్‌ను ప్రొవిజనల్ అప్రూవ్ చేయడానికి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి. అవసరమైన రుసుమును చెల్లించిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. అభ్యర్థులు ఒక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను మాత్రమే సమర్పించాలి. సమర్పించే ముందు, అవసరమైతే, ఫారమ్‌ను జాగ్రత్తగా రివ్యూ చేసి ఎడిట్ చేసుకోవాలి. ఫారమ్‌ను సమర్పించిన తర్వాత ఎడిట్ చేయలేరు. పేమెంట్ ప్రాసెస్ తర్వాత మాత్రమే ఫారమ్ వ్యాలిడ్ అవుతుంది.

డాక్యుమెంట్ అప్‌లోడ్ :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా సమర్పించాలి. పేమెంట్ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్‌ల కలర్-స్కాన్ చేసిన కాపీలను మాత్రమే అప్‌లోడ్ చేయాలి. డాక్యుమెంట్లు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. 300కేబీ సైజు మించకూడదు. డాక్యుమెంట్ ఫొటోకాపీలకు అనుమతి ఉండదు.

Read Also : Smartphone Box Value : కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నాక సీల్ బాక్స్ ఎందుకు పారేయకూడదు.. తప్పక తెలుసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు