Mark Zuckerberg : మెటా సీఈఓ మరుపురాని గిఫ్ట్.. పెరట్లో ఏకంగా భార్య ప్రిస్సిల్లా శిల్పం.. ప్రేమంటే ఇదేగా..!
మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన సతీమణి ప్రిన్సిల్లా చానుకు అద్భుతమైన గిఫ్ట్ అంకితం చేశాడు. తన భార్యపై ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పేశాడు. జీవితాంతం ప్రిన్సిల్లాకు గుర్తిండిపోయేలాంటి గిఫ్ట్ అందించాడు.

Mark Zuckerberg installs sculpture of wife Priscilla in their backyard ( Image Source : Google )
Mark Zuckerberg : ప్రతి భర్తకు తన భార్య అంటే ప్రత్యేకమే.. అందుకే గుర్తుండిపోయేలా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని తపిస్తుంటాడు. ఇది కేవలం సామాన్యులే కాదు.. సెలబ్రిటీల నుంచి టెక్ దిగ్గజాల వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో తమ భాగస్వామిని మరుపురాని బహుమతి ఇచ్చే ఉంటారు.
Read Also : iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ చూశారా? కొత్త డిజైన్ అదుర్స్.. అధికారిక ఫొటో లీక్.. ఫీచర్లు ఇవేనా?
ఇప్పుడు, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కూడా తన సతీమణి ప్రిన్సిల్లా చానుకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. తన భార్యపై ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పేశాడు. జీవితాంతం ప్రిన్సిల్లాకు గుర్తిండిపోయేలాంటి గిఫ్ట్ అందించాడు. ఇంతకీ ఆ బహుమతి ఏంటో తెలుసా? రోమన్ సంప్రదాయం ఉట్టిపడేలా భార్య రూపురేఖలతో కూడిన అద్భుతమైన శిల్పాన్ని చెక్కించి మరి కానుకగా ఇచ్చాడు మెటా బాస్. భార్య శిల్పాన్ని ఏకంగా తన ఇంటి పెరటిలోనే ఏర్పాటు చేశాడు.
40 ఏళ్ల టెక్ మొగల్ ఈ నెల 13న ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య శిల్ఫి ఫొటోను షేర్ చేశారు. ఈ శిల్పం న్యూయార్క్ నగరానికి చెందిన ప్రసిద్ధ కళాకారుడు డేనియల్ అర్షమ్ చెక్కారు. ఈ విగ్రహం టిఫనీ గ్రీన్ పాటినాతో కూడిన ఆర్షమ్ కాంస్య విగ్రహానికి పోలికను కలిగి ఉంది.
View this post on Instagram
“మీ భార్య శిల్పంతో రోమన్ సంప్రదాయాన్ని తిరిగి తీసుకువస్తున్నాం. ధన్యవాదాలు @danilarsham” అని పోస్ట్ క్యాప్షన్ ఇచ్చారు. జుకర్‌బర్గ్ పోస్ట్‌కి ప్రిసిల్లా రిప్లయ్ ఇస్తూ.. “నేను ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది.” అన్నారు. తన శిల్పం వద్ద ప్రిన్సిల్లా కాఫీ తాగుతూ ఫొటోలకు పోజు ఇచ్చారు.
దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటో చూసిన నెటిజన్లు లక్షల్లో లైకులు, కామెంట్లు పెడుతున్నారు. డేనియల్ అర్షమ్, ట్వింకిల్స్, స్పర్క్ల్స్ ఎమోటికాన్‌లతో పోస్ట్‌పై స్పందించారు. అలాంటి ముఖ్యమైన కళాఖండాన్ని తన భార్యకు అంకితం చేసిన జుకర్‌బర్గ్ పోస్టుకు వినియోగదారులు ఆకట్టుకున్నారు. 2003లో మార్క్ జుకర్‌బర్గ్ హార్వర్డ్‌లో ఉన్న సమయంలో కాలేజీ పార్టీలో వీరికి పరిచయమైంది. ఆ తర్వాత 2021 మే 19న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్సిల్లా చాన్‌కు మాక్సిమా, ఆగస్ట్, ఆరేలియా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.