Poco Pad 5G Launch : పోకో ప్యాడ్ 5జీ టాబ్లెట్ వచ్చేస్తోంది.. ఈ నెల 23నే లాంచ్.. కీలక స్పెషిఫికేషన్లు, ధర వివరాలివే!
Poco Pad 5G Launch : పోకో ఇండియా మొట్టమొదటి పోక ప్యాడ్ 5జీ టాబ్లెట్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్ట్ 23 మధ్యాహ్నం 12 గంటలకు ఈ డివైజ్ లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.

Poco Pad 5G India launch set for August 23, specifications ( Image Source : Google )
Poco Pad 5G Launch : కొత్త టాబ్లెట్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి పోకో నుంచి సరికొత్త పోకో ప్యాడ్ 5జీ టాబ్లెట్ రాబోతుంది. పోకో ఇండియా మొట్టమొదటి పోక ప్యాడ్ 5జీ టాబ్లెట్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్ట్ 23 మధ్యాహ్నం 12 గంటలకు ఈ డివైజ్ లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.
పోకో యూజర్లను ఆకట్టుకునేలా క్యాంపెయిన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రాబోయే పోకో టాబ్లెట్ డిజైన్, డిస్‌ప్లే స్పెషిఫికేషన్లను వెల్లడించింది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 16:10 కారక నిష్పత్తికి సపోర్టుతో భారీ 12.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.
Read Also : iPhone 17 Series : బిగ్ కెమెరా అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ ఇదిగో..!
ఈ ప్యానెల్ 600నిట్స్ బ్రైట్‌నెస్, టీయూవీ రైన్‌ల్యాండ్ ట్రిపుల్ సర్టిఫికేషన్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. అన్ని వైపులా గణనీయమైన బ్లాక్ బార్‌లను కలిగి ఉంది. టాబ్లెట్‌లో స్టైలస్, సపరేట్ చేసే కీబోర్డ్‌కు సపోర్టు అందిస్తుంది. అలాగే,బ్లూ కలర్ షేడ్‌లో రానుంది. మిగిలిన వివరాలు ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.
16 గంటల వీడియో స్ట్రీమింగ్ :
పోకో ప్యాడ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఈ టాబ్లెట్ ఫీచర్లలో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 256జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే క్వాడ్ స్పీకర్‌ల సెట్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్ సపోర్టుతో అందిస్తుంది. పోకో ప్యాడ్‌లో 10,000mAh బ్యాటరీ అమర్చి ఉంది. 16 గంటల లాంగ్ వీడియో స్ట్రీమింగ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఇందులో 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. :
పోకో ప్యాడ్ ఫ్రంట్, బ్యాక్ రెండింటిలోనూ 8ఎంపీ కెమెరాలను కలిగి ఉంది. కనెక్టివిటీ ముందు ఫోన్ వై-ఫై6, బ్లూటూత్ 5.2కి సపోర్టు ఇస్తుంది. 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంటుంది. పోకో ప్యాడ్ కీబోర్డ్ విషయానికొస్తే.. మెరుగైన టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం రూపొందించిన 64-కీ లేఅవుట్‌ను కలిగి ఉంది.
ఇందులో షార్ట్‌కట్ కీ కాంబినేషన్‌లు, ఇండిపెండెంట్ పెన్ హోల్డర్ ఉన్నాయి. కీబోర్డ్ బ్లాక్ పీయూ మెటీరియల్‌తో తయారైంది. మురికి, వేలిముద్రలు, చమురు మరకలకు నిరోధకతను కలిగి ఉంటుంది. కీబోర్డ్ స్టాండ్‌బైలో 760 గంటల బ్యాటరీ లైఫ్, 59 గంటల నిరంతర వినియోగాన్ని కలిగి ఉంది. రాబోయే టాబ్లెట్ భారత మార్కెట్లో రూ. 20వేల నుంచి రూ. 25వేల మధ్య ఉండవచ్చని అంచనా.
Read Also : iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ చూశారా? కొత్త డిజైన్ అదుర్స్.. అధికారిక ఫొటో లీక్.. ఫీచర్లు ఇవేనా?