Smartphone Box Value : కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నాక సీల్ బాక్స్ ఎందుకు పారేయకూడదు.. తప్పక తెలుసుకోండి..!
Smartphone Box : సెల్ ఫోన్ వాడినంత కాలం ఫోన్‌తో పాటు వచ్చిన బాక్సును పారేయకూడదు. ఎందుకో తెలుసా? అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో చాలామంది ఫోన్ వినియోగదారులకు తెలియకపోవచ్చు.

away your Smartphone Box after Purchase ( Image Source : Google )
Smartphone Box : కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? అయితే, మీ ఫోన్ బాక్సు ఏం చేశారు? దాచుకున్నారా? అవసరం లేదని పారేశారా? చాలామంది స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత దాని బాక్సును బయట పడేస్తుంటారు. బాక్సులో ఇక అవసరం లేదని భావిస్తుంటారు. కొంతమంది కొత్తలో బాక్సు దగ్గర ఉంచుకుని కొద్దిరోజుల తర్వాత బాక్సు అవసరం లేదులే అని పక్కన పడేస్తుంటారు.
ఇలా చాలామందికి అలవాటు ఉంటుంది. సెల్ ఫోన్ వాడినంత కాలం ఫోన్‌తో పాటు వచ్చిన బాక్సును పారేయకూడదు. ఎందుకో తెలుసా? అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో చాలామంది ఫోన్ వినియోగదారులకు తెలియకపోవచ్చు. బాక్సుతో ఎలాంటి ఉపయోగం ఉండదని భావిస్తుంటారు. బాక్సు వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒరిజినల్ బాక్సు తప్పనిసరి :
సెల్ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్లకు మరో కొత్త ఫోన్ కొనేస్తుంటారు. అయితే, పాత ఫోన్ కొన్నప్పుడు వచ్చిన ఒరిజినల్ బాక్సును కూడా దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే.. ఒకవేళ మొబైల్ ఫోన్ ఎవరికైనా అమ్మేయాలనుకుంటే ఈ ఒరిజినల్ సీల్ బాక్సు అవసరం పడుతుంది. ఈ బాక్సు ఉన్నప్పుడే మీరు అమ్మే ఫోన్‌కు రీసేల్ వాల్యూ ఉంటుంది.
ఎలాంటి పరిస్థితుల్లో కూడా సీల్ బాక్సును చెత్తలో పారేయకూడదు. ఆ బాక్సుపై మీరు కొనుగోలు చేసిన ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. రిపేర్ బాక్సులో ఫోన్ సీరియల్ నెంబరు, ఐఎమ్ఈఐ నెంబరు వంటి ముఖ్యమైన సమాచారంతో నిండి ఉంటుంది. మీ ఫోన్ వారంటీ, రిపేర్ల కొరకు బాక్సుపై ఉండే వివరాలు ఉంటాయి.
స్టోరేజీ :
మీ ఫోన్‌తో పాటు వచ్చిన ఇతర యాక్సరిస్ దాచుకోవాలంటే ఈ బాక్సు ఉపయోగపడుతుంది. మీ ఫోన్ సంబంధిత యాక్సరిస్ దుమ్ము, గీతలు పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మొబైల్ ఫోన్లను స్పెషల్ బాక్సుల్లో స్టోర్ చేసుకోవచ్చు. అందుకే బాక్సును దగ్గరగా ఉంచాలి.
బాక్సు మొదట్లో అవసరం లేకున్నా రానురాను దాని అవసరం తెలుస్తుంది. మీరు ఎవరికైనా మీ స్మార్ట్ ఫోన్ విక్రయిస్తే వారు బాక్సును కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో బాక్సులో పెట్టి ఫోన్ అమ్మేసుకోవచ్చు. కొన్న కొత్తలో ధర అంత లేకపోయినా దాని వాల్యూ దాదాపు రీజనబుల్‌గానే ఉంటుంది.
Read Also : Mark Zuckerberg : మెటా సీఈఓ మరుపురాని గిఫ్ట్.. పెరట్లో ఏకంగా భార్య ప్రిస్సిల్లా శిల్పం.. ప్రేమంటే ఇదేగా..!