Mark Zuckerberg : మెటా సీఈఓ జుకర్‌బర్గ్ జర మేలుకో.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అంతరించే ప్రమాదం ఉంది.. ఏఐ సైంటిస్టు హెచ్చరిక!

Meta CEO Mark Zuckerberg : ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ వేగాన్ని అందుకోనేలా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేగంగా పనిచేయకపోతే త్వరలోనే అంతరించి పోయే ప్రమాదం ఉందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ని కంపెనీ చీఫ్ ఏఐ శాస్త్రవేత్త గట్టిగానే హెచ్చరించారు.

Meta CEO Mark Zuckerberg was warned that Instagram and Facebook could go extinct, here is why

Meta CEO Mark Zuckerberg : ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపైనే దృష్టిపెట్టింది. ఏఐ చాట్‌జీపీటీ రాకతో ఏఐ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ 2022లో చాట్‌జీపీటీ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ ఏఐ టూల్ వేగంగా పనిచేస్తూ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఇంతకుముందు మానవులకు మాత్రమే సాధ్యమైన పనులను కూడా చాలా వేగంగా ఇప్పుడు ఏఐ పూర్తి చేస్తోంది. రాబోయే భవిష్యత్తులో ఈ అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీ మరింత శక్తివంతంగా అభివృద్ధి చెందుతుందని మనందరికీ తెలుసు.

Read Also : Facebook Profiles : ఒకే ఫేస్‌బుక్ అకౌంట్‌.. మల్టీ ప్రొఫైల్ ప్రైవసీ అకౌంట్లను క్రియేట్ చేయొచ్చు..!

చాట్ జీపీటీ ప్రారంభించిన కొద్దిసేపటికే.. టెక్ దిగ్గజం గూగుల్ కూడా అప్రమత్తమైంది. తమ ఉనికికి ప్రమాదం పొంచి ఉందని గుర్తించి సొంత ఏఐ ప్రొడక్టులపై దృష్టిపెట్టినట్టు ఇప్పటికే అనేక నివేదికలు వెలువడ్డాయి. ఇప్పుడు, మెటా దిగ్గజం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఏఐ చాట్‌జీపీటీ వేగాన్ని అందుకునేలా సొంత ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయకపోతే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం లేకపోలేదని కంపెనీ టాప్ ఏఐ శాస్త్రవేత్త ఒకరు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను హెచ్చరించారు.

Meta CEO Mark Zuckerberg

చాట్‌జీపీటీ లాంచ్‌పై మెటా ఏఐ శాస్త్రవేత్త ఏమన్నారంటే? :
చాట్‌జీపీటీ మార్కెట్‌లోకి ప్రవేశించి దాదాపు ఏడాది దాటిపోయింది. మెటా ఇంకా ఏఐ రేసులో సరిగ్గా అడుగుపెట్టలేదు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో భాగమైన సొంత ఏఐ చాట్‌బాట్‌లను కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ చాట్‌బాట్‌లు ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం.. మెటా చీఫ్ ఏఐ శాస్త్రవేత్త యాన్ లెకున్ మార్క్ జుకర్‌బర్గ్‌తో మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ కొత్త చాట్‌బాట్‌తో వేగంగా సొంత ఏఐ అసిస్టెంట్ టెక్నాలజీని త్వరలో రిలీజ్ చేయాలని చెప్పారు.

మెటా ప్రధాన కార్యాలయంలో లంచ్ సమయంలో వీరిద్దరూ దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. మెటా త్వరలో సొంత ఏఐ అసిస్టెంట్‌లో పనిచేయడం ప్రారంభించకపోతే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మనుగడకే ముప్పు వాటిల్లి అంతరించిపోయే అవకాశం ఉందని లెకున్ హెచ్చరించారు. ఏఐ సైంటిస్ట్ లెకున్ ప్రకటనపై జుకర్‌బర్గ్ వెంటనే స్పందించలేదు. కానీ, ఆయన మాటలు మెటా సీఈఓకు చిరాకును తెప్పించాయని మరో నివేదిక పేర్కొంది. అయినప్పటికీ, ఆ సాయంత్రం తర్వాత, జుకర్‌బర్గ్ లెకున్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నానని, ఆయన వాదన సరైనదేనని చెప్పినట్టు నివేదిక తెలిపింది.

మెటా ఏఐ అసిస్టెంట్ గురించి వివరాలివే :

మెటా ఈ ఏడాది సెప్టెంబర్‌లో సొంత ఏఐ అసిస్టెంట్‌ని ప్రవేశపెట్టింది. దీనికి మెటా ఏఐ అని కూడా పేరు పెట్టింది. మైక్రోసాఫ్ట్ బింగ్‌తో మెటా భాగస్వామ్యం కుదుర్చుకుని ఏఐ అసిస్టెంట్ ఇమేజ్‌లను కూడా రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. మెటా ఏఐ అనేది ఒక వ్యక్తిలాగా ఇంటరాక్ట్ చేయగల కొత్త అసిస్టెంట్ టూల్. అందులోనూ వాట్సాప్, మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉంది.

AI ChatGPT Tool

త్వరలో రే-బ్యాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్, క్వెస్ట్ 3కి కూడా అందుబాటులోకి వస్తుంది. లామా 2 నుంచి టెక్నాలజీని ప్రభావితం చేసే అనుకూల మోడల్‌తో పనిచేస్తుంది. లేటెస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) పరిశోధన, టెక్స్ట్-ఆధారిత చాట్‌లలో, బింగ్‌తో సెర్చింగ్ భాగస్వామ్యం ద్వారా మెటా ఏఐ రియల్ టైమ్ డేటాను యాక్సెస్ చేస్తుంది. అంతేకాదు.. ఇమేజ్ ప్రొడక్ట్ కోసం ఒక టూల్ కూడా అందిస్తుందని కంపెనీ బ్లాగ్‌లో పేర్కొంది.

మెటా ఏఐతో పాటు, టెక్ దిగ్గజం విభిన్న పర్సనాలిటీలతో 28 ఇతర ఏఐ చాట్‌బాట్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్‌లలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో పాటు ‘బ్యాక్‌స్టోరీ’ని కలిగి ఉన్నాయని పేర్కొంది. అంతే కాదు.. ఈ చాట్‌బాట్‌లకు సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. ఈ ఏఐలలో కొన్నింటిని ప్లే చేయడానికి, రూపొందించడానికి సాంస్కృతిక చిహ్నాలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అందులో ప్రతిది ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లను కలిగి ఉంటాయి. అవేంటో అందరూ అన్వేషించవచ్చునని మెటా కంపెనీ తెలిపింది.

Read Also : Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ రెండర్లు, ఫుల్ ఫీచర్లు లీక్.. ఇంతకీ ఈ మూడు ఫోన్ల లాంచ్ డేట్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు