Meta service outage : ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. లాగిన్ సమస్యలతో యూజర్ల ఇబ్బందులు!

Meta service outage : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోయాయి. లాగిన్ సమస్యలతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Meta service outage causing Facebook, Messenger, Instagram

Meta service outage : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో భారత్ పాటు ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో నిలిచిపోయాయి. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో లాగ్ ఇన్ సమస్యల గురించి వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. లాగిన్ సమస్యలతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండింటి నుంచి ఆటో లాగ్ అవుట్ అయ్యారు. కొందరు ఇన్‌స్టాగ్రామ్ పేజీలను రిఫ్రెష్ చేయలేకపోయారు. చాలా మంది వినియోగదారులు పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలనే ఎర్రర్ కనిపిస్తుందని చెబుతున్నారు.

భారత్ సహా పలు దేశాల్లో మెటా సర్వీసులు నిలిచిపోయినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్ బుక్ యూజర్లు తమ అకౌంట్లో లాగిన్ అయినప్పటికీ ప్రతిసారి లాగిన్ చేయమంటూ మెసేజ్ డిస్ ప్లే కనిపిస్తోంది. డెస్క్ టాప్ మాత్రమే కాదు.. మొబైల్ యాప్ యూజర్లు కూడా లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

లాగిన్ పాస్ వర్డ్ ఎంటర్ చేయగానే మళ్లీ ఆటో లాగౌట్ అయిపోతుంది. మరికొంతమందికి పాస్ వర్డ్ రాంగ్ అంటూ మెసేజ్ కనిపిస్తోంది. ఎన్నిసార్లు పాస్ వర్డ్ ఎంటర్ చేసినా అదే ఎర్రర్ మెసేజ్ కనిపించడంతో యూజర్లు గందరగోళం చెందుతున్నారు. లాగిన్ అయిన ప్రతిసారి పేజీ రిఫ్రెష్ అవుతూ ఆటో లాగిన్ అవుతున్నట్టు వాపోతున్నారు.

Read Also : Lava Blaze Curve 5G : కర్వ్డ్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ 17,999 మాత్రమే!

వాస్తవానికి పాస్ వర్డ్ సరైనదే అయినప్పటికీ ఫేస్ బుక్ ప్లాట్ ఫారంలో సాంకేతిక సమస్య కారణంగా ఇలా మెసేజ్ కనిపిస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎన్నిసార్లు లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించినా ఇదే మెసేజ్ కనిపిస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. మొదటి రిపోర్టింగ్ నుంచే 3లక్షల కన్నా ఎక్కువ నివేదికలు డౌన్ డిటెక్టర్‌కు అందాయి.

ఇన్ స్టాగ్రామ్, థ్రెడ్ సర్వీసులు కూడా :
ట్విట్టర్ (X) ప్లాట్ ఫారం యూజర్ల ఫిర్యాదులతో నిండిపోయింది. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector ప్లాట్ ఫారం పదివేల మంది వినియోగదారుల నివేదికలతో మెటా ప్లాట్‌ఫారమ్‌ల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌లో ఉన్నాయని వెల్లడించింది. ఫేస్‌బుక్ 3లక్షల కన్నా ఎక్కువ అంతరాయాల నివేదికలు ఉన్నాయి. అయితే, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల నుంచి 20వేల కన్నా ఎక్కువ నివేదికలు ఉన్నాయి.

ఒక్క ఫేస్ బుక్ మాత్రమే కాదు.. ఇన్‌స్టాగ్రామ్, మెసేంజర్ యాప్ సహా అన్నింట్లో ఇదే అంతరాయం ఏర్పడింది. థ్రెడ్స్ యాప్ సర్వీసు కూడా నిలిచిపోయింది. ఏది ఏమైనప్పటికీ యూజర్లు తమ పాస్ వర్డ్ మార్చాల్సిన అవసరం లేదని గమనించాలి. వాస్తవానికి ఇది మెటా సర్వీసు అంతరాయం కారణంగా ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే చాలామంది యూజర్లు డౌన్ డిటెక్టర్, సోషల్ మీడియా వేదికగా లాగిన్ సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై ఇప్పటివరకూ మెటా అధికారికంగా స్పందించలేదు.

కొద్ది సేపటికి ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక కారణాల వల్లే సర్వీసులు నిలిచిపోయి ఉంటాయని భావిస్తున్నారు. సర్వీసులు పనిచేయడంతో యూజర్లంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read Also : YouTube Create App : భారతీయ యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్‌ న్యూస్.. ఈ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు!