Lava Blaze Curve 5G : కర్వ్డ్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ 17,999 మాత్రమే!

Lava Blaze Curve 5G Launch : లావా ఇండియా కొత్త బ్లేజ్ కర్వ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ. 20వేల లోపు ధరలో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది.

Lava Blaze Curve 5G : కర్వ్డ్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ 17,999 మాత్రమే!

Lava Blaze Curve 5G with curved display launched in India

Updated On : March 5, 2024 / 5:56 PM IST

Lava Blaze Curve 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా ఇండియా నుంచి మరో ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. అదే.. లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 20వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అయితే, కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్‌లతో వస్తుంది. రూ. 20వేల కన్నా తక్కువ ధరలో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7050, యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

Read Also : Vivo V30 Pro Series Launch : ఈ వారమే వివో వి30 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర వివరాలు లీక్..!

లావా బ్లేజ్ కర్వ్ 5జీ ధర ఎంతంటే? :
లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ 5జీ ఫోన్ ధర రూ.17,999కు పొందవచ్చు. 8జీబీ+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999కు పొందవచ్చు. ఈ డివైజ్ మార్చి 11, 2024న కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు లావా ఇ-స్టోర్‌లో లేదా అమెజాన్, లావా రిటైల్ నెట్‌వర్క్ సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి డివైజ్ కొనుగోలు చేయవచ్చు. లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్ ఆప్షన్ కోరుకునే వినియోగదారులకు సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

లావా బ్లేజ్ కర్వ్ 5జీ స్పెసిఫికేషన్‌లు :
లావా బ్లేజ్ కర్వ్ 5జీ అనేది కొత్త స్మార్ట్‌ఫోన్. ప్రత్యేకించి ఒకేసారి చాలా యాప్‌లను ఉపయోగించాలనుకునే యూజర్లకు బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. 8జీబీ మెమరీని కలిగి ఉంది. అదనంగా, సూపర్ ఫాస్ట్ స్టోరేజ్ సిస్టమ్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ గేమ్‌లు, యాప్‌లను బాగా హ్యాండిల్ చేయగలదు. లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ సూపర్-ఫాస్ట్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఐరన్ గ్లాస్, విరిడియన్ గ్లాస్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. వైడ్ యాంగిల్, మాక్రో లెన్స్‌లతో పాటు షార్ప్, క్లియర్ ఫొటోలు తీయడానికి 64ఎంపీ ప్రైమరీ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది. సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. లావా బ్లేజ్ కర్వ్ 5జీ డాల్బీ అట్మోస్‌కు సపోర్టు ఇచ్చే స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. మంచి ఆడియో క్వాలిటీని అందిస్తుంది.

ఆండ్రాయిడ్ 13 క్లీన్, యాడ్-ఫ్రీ వెర్షన్‌లో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్‌లకు రెగ్యులర్ అప్‌డేట్‌లను పొందవచ్చు. మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా రిలీజ్ చేస్తుంది. లావా బ్లేజ్ కర్వ్ 5జీ భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఎక్కువగా మన్నికగా ఉంటుంది. వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మీ ఫోన్ బ్యాటరీ అయిపోయినప్పుడు త్వరగా రీఛార్జ్ చేసుకోవచ్చు. లావా బ్లేజ్ ఫోన్ ధర రూ. 17,999 నుంచి అందుబాటులో ఉంటుంది.

Read Also : Jio New 5G Smartphone : గుడ్ న్యూస్.. రూ. 10వేల లోపు ధరలో కొత్త జియో 5G స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది!