Meta AI Chatbot : ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లోనూ మెటా ఏఐ చాట్‌బాట్‌.. పరిమిత యూజర్లకు మాత్రమే..!

Meta AI Chatbot : ప్రముఖ మెటా కంపెనీ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌‌లో ఏఐ చాట్‌బాట్ తీసుకొస్తోంది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ మెటా కొత్త ఏఐ ఫీచర్ అందిస్తోంది.

Meta AI Chatbot : ప్రముఖ మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌ను నేరుగా సెర్చ్ బార్ సెక్షన్‌లో ఇంటిగ్రేట్ చేసింది. ఆండ్రాయిడ్ 2.24.7.14 అప్‌డేట్ ఇంతకుముందు వాట్సాప్ బీటాలో కనిపించింది. ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు స్టేబుల్ వెర్షన్‌లో యూజర్లు మెటా ఏఐ చాట్‌బాట్‌ని ఉపయోగించి వారి ప్రశ్నలను క్లియర్ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ.50వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

ఈ ఏఐ చాట్ కూడా చాట్‌జీపీటీ మాదిరిగానే పనిచేస్తుంది. మీరు ఈ చాట్‌బాట్‌ని ఏదైనా ప్రశ్న అడగవచ్చు. మీకు అవసరమైన వివరాలను అందిస్తుంది. చాట్‌బాట్ సెర్చ్ బాక్సులో ఇంటిగ్రేట్ చేసే ఫీచర్ కోసం ప్రత్యేకించి వెతకాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఈ ఏఐ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది.

ఈ సెర్చ్ ఇంటర్‌ఫేస్‌లో నేరుగా ప్రాంప్ట్‌లు, సూచనలను అందించడం ద్వారా మెటా ఏఐతో యూజర్ ఎంగేజ్‌మెంట్ క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుందని నివేదిక నివేదించింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌లకు అప్‌డేట్ చేసిన తర్వాత దేశాల్లోని నిర్దిష్ట యూజర్లకు ఈ ఏఐ చాట్‌బాట్‌కు యాక్సెస్ అందిస్తుంది. ముఖ్యంగా, భారత్‌లోని యూజర్లు మెటా చాట్‌బాట్‌కు వేగంగా యాక్సస్ కోసం టాప్ యాప్ బార్‌లో ప్రత్యామ్నాయ ఎంట్రీ పాయింట్‌ను అందిస్తుంది.

ప్రశ్నల కోసం సెర్చ్‌ బార్ వాడొచ్చు :
సెర్చ్ బార్‌లోని కమ్యూనికేషన్ డేటా పూర్తిగా గోప్యంగా ఉంటాయని వాట్సాప్ యూజర్లకు హామీ ఇస్తోంది. చాట్‌బాట్‌కు రీడైరెక్ట్ అయితే తప్ప యూజర్ల ప్రశ్నలు మెటా ఏఐతో షేర్ కావు. అలానే డేటా ప్రైవసీని అందిస్తుంది. సెర్చ్ బార్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌ని ఇంటిగ్రేట్ చేసినప్పటికీ పాతదానిలో వర్క్ చేస్తూనే ఉంటుందని గుర్తుంచుకోవాలి. సరళంగా చెప్పాలంటే.. ఇప్పటికీ సెర్చ్ బాక్సును ఉపయోగించి నిర్దిష్ట చాట్‌లు లేదా మెసేజ్‌ల కోసం సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు, మెటా ఏఐ చాట్‌బాట్‌ని ఉపయోగించి యూజర్ల ప్రశ్నలను క్లియర్ చేసేందుకు ఈ బార్‌ని ఉపయోగించవచ్చు.

త్వరలో వాట్సాప్ యూజర్లందరికి :
పర్సనల్ మెసేజ్‌లు, కాల్ ప్రైవసీతో పాటు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ అందిస్తుంది. వాట్సాప్ లేదా మెటా ఏవీ యూజర్ కమ్యూనికేషన్‌లను యాక్సెస్ చేయలేరు. ప్రస్తుతం పరిమితంగానే మెటా ఏఐ ఇంటిగ్రేషన్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. మెటా రాబోయే నెలల్లో మరింత మంది యూజర్లకు ఈ ఏఐ ఫీచర్ అందించనుంది. వాట్సాప్ మాత్రమే కాకుండా అదే ఏఐ చాట్‌బాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే యాప్‌లోని డైరెక్ట్ మెసేజ్ సెక్షన్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు.

Read Also : Amazon Mega Electronics Days Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్‌వాచ్, హెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

ట్రెండింగ్ వార్తలు