Amazon Mega Electronics Days Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్‌వాచ్, హెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Amazon Mega Electronics Days Sale : ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు అనేక ప్రొడక్టులపై 80 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

Amazon Mega Electronics Days Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్‌వాచ్, హెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Amazon Mega Electronics Days Sale Brings Discounts on Laptops, Headphones, Smartwatches and More

Amazon Mega Electronics Days Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఇప్పుడు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి గల వినియోగదారులు అనేక ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు అనేక ప్రొడక్టులపై 80 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, జమ్ముకశ్మీర్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టుల ధరలపై మరింత తగ్గింపు పొందవచ్చు.

Read Also : Realme Narzo 70 Pro 5G Sale : రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ సేల్ ఆఫర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

అమెజాన్ సేల్ టైమ్‌లైన్, డిస్కౌంట్లు :
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఏప్రిల్ 18న ముగుస్తుంది. ఈ సేల్ సమయంలో, కస్టమర్‌లు ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, కెమెరాలు, ఇతర ప్రొడక్టులపై తగ్గింపు ధరలకు పొందవచ్చు. అమెజాన్ సేల్ సమయంలో అనేక ప్రొడక్టు తగ్గింపు ధరలకు విక్రయిస్తోంది. మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి మీ కొనుగోలు ధరను 10 శాతం తగ్గించవచ్చు. ఈ తగ్గింపు జమ్ముకశ్మీర్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై కూడా వర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. బెస్ట్ డీల్స్, ఆఫర్లు :
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ సమయంలో గేమింగ్ ల్యాప్‌టాప్‌లను తగ్గింపు ధరలలో కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు.. హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల ఐపీఎస్ స్క్రీన్, 12వ జనరేషన్ ఐటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూ ప్రస్తుతం రూ. 68,900 అయితే, ల్యాప్‌టాప్ వాస్తవానికి అమెజాన్‌లో రూ. 888,646కు అందుబాటులో ఉంది. అదేవిధంగా, 11వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5 సీపీయూ, ఆర్టీఎక్స్ 2050 జీపీయూతో కూడిన అసూస్ టీయూఎఫ్ ఎఫ్17 గేమింగ్ ల్యాప్‌టాప్ ధర ధర రూ. 77,990 నుంచి రూ. 49,990కు కొనుగోలు చేయొచ్చు.

సాధారణ ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే.. 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5 సీపీయూ, 16జీబీ ర్యామ్‌తో హెచ్‌పీ 15ఎస్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 68,223 బదులుగా
రూ. 53,990కు పొందవచ్చు. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3ని 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 సీపీయూ, 512జీబీ ఎస్ఎస్‌డీతో అసలు ధర రూ. 79,690 నుంచి రూ. 59,990కు పొందవచ్చు. ఐప్యాడ్‌ని కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారులు ఐప్యాడ్ ఎయిర్ (5వ జనరేషన్)ని ఎం1 చిప్, లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో ఎంచుకోవచ్చు.

ఈ డివైజ్ ధర రూ. 59,900 నుంచి రూ. 53,999కు తగ్గింపు పొందవచ్చు. ఎస్ పెన్‌తో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ రూ. 30,999కు బదులుగా రూ. 22,999కు పొందవచ్చు. అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయిన గోప్రో హీరో 12 మోడల్ రూ. 45వేలు ఇప్పుడు ధర రూ. 37,990కు కొనుగోలు చేయొచ్చు. షావోమీ ఎంఐ 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా 2కె ఏఐ-ఆధారిత మోషన్ డిటెక్షన్, నైట్ విజన్ సపోర్ట్‌తో రూ. 4,999 ధర నుంచి రూ. 2,999కు తగ్గింపు పొందవచ్చు.

సోనీ పాపులర్ (WH-1000XM4) హెడ్‌ఫోన్‌లు 30 గంటల బ్యాటరీ లైఫ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ధర రూ. 19,990 బదులుగా రూ. 22,990కు అందిస్తోంది. మీరు బోస్క్వైయిట్ కంపోర్ట్ 45ని కూడా ఎంచుకోవచ్చు. సోనీ హెడ్‌ఫోన్‌ల ధరలోనే లభిస్తుంది. ఈ డివైజ్ ధర రూ. 29,900కు పొందవచ్చు. రియల్ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్‌ల కోసంచూస్తుంటే.. జేబీఎల్ వేవ్ ఫ్లెక్స్ ధర రూ. 2,998 జాబితా ధర రూ. 4,999 కన్నా తక్కువగా ఉంటుంది.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ.50వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!