Realme Narzo 70 Pro 5G Sale : రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ సేల్ ఆఫర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ రియల్‌మి నార్జో 70ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కస్టమర్‌లు రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ 5జీ ఫోన్ మోడల్ అసలు ధర రూ.19,999 నుంచి రూ.17,999కు తగ్గింపు పొందవచ్చు.

Realme Narzo 70 Pro 5G Sale : రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ సేల్ ఆఫర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Realme announces sale offers for Narzo 70 Pro 5G

Updated On : April 12, 2024 / 4:33 PM IST

Realme Narzo 70 Pro 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో కూడా అమ్మకానికి వచ్చింది. అయితే, ఇప్పుడు కొన్ని వారాల తర్వాత కంపెనీ రూ.3వేల వరకు తగ్గింపుతో స్పెషల్ సేల్ ఆఫర్‌లను ప్రకటించింది.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్‌ ఎలా పొందాలంటే?

రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. రియల్‌మి బ్యాంక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఏదైనా బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి చేసే లావాదేవీలపై వర్తిస్తుంది. ఇందులో, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో నార్జో 70ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కస్టమర్‌లు రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. దాంతో ఈ 5జీ ఫోన్ మోడల్ ధర రూ.19,999 నుంచి రూ.17,999కు తగ్గింపు పొందవచ్చు.

రియల్‌మి నార్జో 70 ప్రోపై రూ.3వేలు తగ్గింపు :
రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 3వేల తగ్గింపు అందిస్తోంది. ఈ 5జీ ఫోన్ అసలు ధర రూ. 21,999 ఉండగా.. సేల్ ఆఫర్‌తో రూ. 18,999కి అందుబాటులో ఉంటుంది. రియల్‌మి 70ప్రో 5జీ ఫోన్ మంచి డిస్‌ప్లేను కలిగి ఉంది. గేమింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఇందులో ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. డిక్లటర్డ్ యూఐ, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. నార్జో 70ప్రో 5జీ ఫోన్ కూడా ఎయిర్ గెచ్చర్స్ కలిగి ఉంది. కానీ, కొంత అప్‌గ్రేడ్ అవసరం.

కెమెరా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
రియల్‌మి నార్జో 70 ప్రో 5జీ ఫోన్ హారిజన్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. రియల్‌మి నార్జో 60 ప్రో మాదిరి ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్ కెమెరా చాలావరకు బాగానే ఉంది. వృత్తాకార కెమెరా ఐలాండ్, 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్‌సెట్, ఆక్టా-కోర్ ప్రాసెసర్, మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి. 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 2ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్‌తో వస్తుంది.

ఎయిర్ గెచర్.. టచ్ చేయకుండానే కంట్రోలింగ్ :
రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్ అద్భుతమైన ఇమేజింగ్‌ను అందిస్తుంది. సెల్ఫీలు, వీడియోలకు 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో ఆధారితమైన ఈ ఫోన్ వేగవంతమైన రీఛార్జింగ్ కోసం 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. రియల్‌మి నార్జో 70ప్రో డివైజ్ ఎయిర్ గెస్చర్ ఫీచర్ ద్వారా టచ్ చేయకుండానే ఆపరేట్ చేయొచ్చు. ఇంటెన్సివ్ యూసేజ్ సమయంలో వేడెక్కకుండా 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.

Read Also : Infinix Note 40 Pro Series : వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంతంటే?