Infinix Note 40 Pro Series : వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంతంటే?

Infinix Note 40 Pro Series : ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో దేశంలోనే అత్యంత చౌకైన ధరకు వచ్చేసింది. ఈ 5జీ ఫోన్ రూ.21,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయొచ్చు.

Infinix Note 40 Pro Series : వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంతంటే?

Infinix Note 40 Pro series launched with wireless charging support

Infinix Note 40 Pro Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ 5జీ ఫోన్ ధర రూ 19,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్‌లో స్పెషిఫికేషన్లు, చిన్న తేడాలతో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో, ప్రో ప్లస్ అనే రెండు మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీ, 120హెచ్‌జెడ్ డిస్‌ప్లే, 108ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ అందించే దేశంలోనే అత్యంత చౌకైన ఫోన్‌లుగా చెప్పవచ్చు.

Read Also : iPhone 16 Battery Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలు లీక్.. ఐఫోన్ 15 ప్లస్ కన్నా చిన్న బ్యాటరీతో రావొచ్చు!

ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ భారత్ ధర, సేల్ ఆఫర్లు :
కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ.21,999 ప్రారంభ ధరతో వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ప్లస్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 24,999 ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ. 2వేలు తగ్గింపు కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ధరను రూ.19,999కి తగ్గిస్తుంది. ఈ 5జీ ఫోన్ అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్లలో విక్రయిస్తోంది.

కొత్త ఇన్ఫినిక్స్ మిడ్-రేంజ్ ఫోన్‌ల సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. లాంచ్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో కొనుగోలుదారులకు కంపెనీ రూ.4,999 విలువైన మ్యాగ్‌కిట్‌ను ఉచితంగా అందిస్తోంది. మ్యాగ్‌కిట్‌లో మ్యాగ్ కేస్, మ్యాగ్ పవర్ ఛార్జర్ (3020mAh పవర్ బ్యాంక్) ఉన్నాయి. కంపెనీ మ్యాగ్ ప్యాడ్ (15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జర్)ని కూడా అందిస్తోంది. అయితే, దీన్ని మాత్రం విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ ఫోన్, నోట్ 40ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు రెండూ ఒకే విధమైన స్పెషిఫికేషన్లను అందిస్తాయి. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1300నిట్స్ గరిష్ట ప్రకాశం, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్‌తో పెద్ద 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తాయి. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 6ఎన్ఎమ్ ప్రాసెసర్ నుంచి పవర్ అందిస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో సిరీస్ ఓఐఎస్‌తో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్, 2ఎంపీ డెప్త్ కెమెరాతో అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ కెమెరాను పొందవచ్చు. రెండు డివైజ్‌ల్లో ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ప్లస్ 100డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ సరసమైన వెర్షన్ నోట్ 40 ప్రో మోడల్ 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ రెండు డివైజ్‌లు 20డబ్ల్యూ వైర్‌లెస్ మ్యాగ్‌ఛార్జ్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. ఈ కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్‌లు రూ. 25వేల లోపు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తాయి. అదనంగా, ఈ ఫోన్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, జేబీఎల్ ద్వారా ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లు, ఐపీ53 రేటింగ్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Apple Warn iPhone Users : మెర్సిన‌రీ స్పైవేర్‌ అటాక్.. భారత్ సహా 92 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరిక..!