Microsoft Lays Off 1800 Employees As Part Of Restructuring Process, To Hire More
Microsoft Employees : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు షాకిచ్చింది. తమ కంపెనీ నుంచి దాదాపు 1800 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. జూన్ 30తో ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఈ క్రమంలో కంపెనీలోని లక్షా 80వేల మంది ఉద్యోగుల్లో ఒక శాతం మందిని మైక్రోసాఫ్ట్ తొలగించింది. రానున్న రోజుల్లో మైక్రోసాఫ్ట్ నిర్మాణాత్మక సర్దుబాట్లలో భాగంగా మరికొంత మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో పలు ప్రాంతాల్లో పనిచేసే 1800 మంది ఉద్యోగులను తొలగించింది. ఎక్కువగా కస్టమర్, కన్సల్టింగ్, పార్టనర్ సొల్యూషన్ వంటి గ్రూపుల్లో ఉద్యోగులను తొలగించింది.
ఇకపై మైక్రోసాఫ్ట్ కొత్త ఉద్యోగుల నియామకాన్ని కొనసాగించనుంది. అమెరికాలో జూలై 4 సెలవులు తర్వాత ఈ ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టింది. ముందుగా తక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని మైక్రోసాఫ్ట్ భావించింది. అన్ని కంపెనీల మాదిరిగానే నష్టాలను సవరించుకుని సర్దుబాట్లు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపింది. పెట్టుబడుల అనంతరం మళ్లీ కంపెనీల్లో కొత్త ఉద్యోగులతో నియామకాలను చేపట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రస్తుతానికి ఉద్యోగుల తొలగింపులు ఉన్నప్పటికీ.. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని, రాబోయే సంవత్సరంలో మొత్తం ఉద్యోగులను పెంచాలని యోచిస్తున్నట్లు Microsoft తెలిపింది.
Microsoft Lays Off 1800 Employees As Part Of Restructuring Process, To Hire More
మరో పెద్ద టెక్ దిగ్గజం, Google, 2022లో ఉద్యోగ నియామకాలను తగ్గించినట్టు ప్రకటించింది. CEO సుందర్ పిచాయ్ ఇప్పటికే తమ ఉద్యోగులకు మెమోను పంపారు. ఇంజనీరింగ్, సాంకేతిక, నియామకాలపై కంపెనీ దృష్టి సారిస్తుందని ఉద్యోగులకు తెలిపారు. కంపెనీ ఆదాయ లక్ష్యాలను సాధించడంలో విఫలమైన మెటా ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనున్నట్టు ప్రకటించిన వారాల తర్వాత గూగుల్ సీఈఓ పిచాయ్ మెమోను పంపారు. అలాగే స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్ కూడా నియామక ప్రక్రియను తగ్గించినట్టు ప్రకటించింది. బిలియనీర్ ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగులలో కొంతమందిని తొలగించింది.