Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?

Microsoft లేటెస్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ Go 2 ఇప్పుడు భారత మార్కెట్లో లాంచ్ అయింది. వాణిజ్యపరమైన అన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది.

Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?

Microsoft Surface Laptop Go 2 With Intel Core I5 Cpu Launched In India

Microsoft Surface Laptop Go 2 : Microsoft లేటెస్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ Go 2 ఇప్పుడు భారత మార్కెట్లో లాంచ్ అయింది. వాణిజ్యపరమైన అన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది. ప్రధానంగా Amazon, Reliance Digital ఆన్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయొచ్చు. కొత్త-జెన్ మోడల్ అప్ డేట్ ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ విండోస్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది. మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్ హైబ్రిడ్ లెర్నింగ్, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రత్యేకించి రూపొందించింది కంపెనీ. దీని బరువు కేవలం 1.12 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈజీగా క్యారీ చేసేందుకు వీలుంటుంది.

సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2 ధర ఎంతంటే? :
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2 మల్టీ స్టోరేజ్ మోడల్‌లతో వచ్చింది. భారత మార్కెట్లో 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.73,999 నుంచి ప్రారంభమవుతుంది. 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.80,999గా ఉంది. మైక్రోసాఫ్ట్ ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం.. సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2ని కూడా అందిస్తోంది. ఇందులో మరో రెండు మోడల్స్ ఉన్నాయి. 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,090, 16GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ.1,04,590గా ఉంది. మైక్రోసాఫ్ట్ ఇండియా పేజీలో ఇప్పటికీ ‘Coming Soon’ అని పేర్కొంది. అమెజాన్‌లో కూడా ఇంకా అందుబాటులో లేదు. సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2 అల్యూమినియం బాహ్య, ప్లాటినమ్‌లో మెటల్ ఎండ్‌తో రూపొందించారు.

Microsoft Surface Laptop Go 2 With Intel Core I5 Cpu Launched In India (2)

Microsoft Surface Laptop Go 2 With Intel Core I5 Cpu Launched In India

స్పెసిఫికేషన్‌లు ఇవే :
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2 12.4-అంగుళాల పిక్సెల్‌సెన్స్ డిస్‌ప్లేతో 1,536×1,024 పిక్సెల్ రిజల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ల్యాప్‌టాప్ 11వ-జనరల్ ఇంటెల్ కోర్ i5-1135G7 CPU నుంచి ఇంటిగ్రేటెడ్ Intel Iris Xe GPU, 8GB వరకు LPDDR4x RAMతో వచ్చింది. యూజర్లు 256GB వరకు SSD స్టోరేజీ ఆప్షన్ కూడా పొందవచ్చు.

కనెక్టివిటీ పరంగా.. సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2 హెడ్‌ఫోన్స్ జాక్‌తో పాటు సింగిల్ USB-C, USB-A పోర్ట్‌ను కలిగి ఉంది. వైర్‌లెస్ కనెక్టివిటీ ముందు, యూజర్లు బ్లూటూత్ 5.1, Wi-Fi 6ని ఉపయోగించవచ్చు. 41Wh బ్యాటరీ యూనిట్ కూడా ఉంది. 13.5 గంటల బ్యాటరీని అందించవచ్చు. సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2 ఇతర ముఖ్య ఫీచర్లు, HD కెమెరా, డ్యూయల్ ఫార్-ఫీల్డ్ స్టూడియో మైక్స్, డాల్బీ ఆడియో ప్రీమియంతో కూడిన ఓమ్నిసోనిక్ స్పీకర్లు ఉన్నాయి. సర్ఫేస్ ల్యాప్‌టాప్ గో 2 బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను అందిస్తుందా? లేదా అనేది క్లారిటీ లేదు.

Read Also : Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!