×
Ad

Mobile Recharge Hike : బిగ్ షాకింగ్ న్యూస్.. కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. ఎయిర్‌టెల్, జియో, Vi యూజర్లలో ఆందోళన!

Mobile Recharge Hike : రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా మొబైల్ రీఛార్జ్ రేట్లు 10 శాతం నుంచి 12శాతం పెరిగే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి.

Mobile Recharge Hike

Mobile Recharge Hike : మొబైల్ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. అతి త్వరలో మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరగబోతున్నాయి.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారతీయ టెలికం మార్కెట్లో మొబైల్ టారిఫ్ ధరలు భారీగా పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి.

నివేదికల ప్రకారం.. డిసెంబర్ చివరి నాటికి లేదా కొత్త ఏడాది 2026 ప్రారంభం నాటికి ప్రముఖ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) తమ రీఛార్జ్ ప్లాన్‌లను 10 శాతం నుంచి 12శాతం పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.

ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేనప్పటికీ, పేమెంట్ యాప్‌లలో అలర్ట్స్ రావడం వినియోగదారుల్లో ఆందోళనలను పెంచాయి. డిసెంబర్ 2025 నుంచి భారత్‌లో మొబైల్ రీఛార్జ్‌లు పెరుగుదలకు సంబంధించి 3 టెలికం కంపెనీలలో ఏ ఒక్కటి ఇంకా ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు.

రీఛార్జ్ ధరలపై అలర్ట్స్.. యూజర్లలో ఆందోళన :

ఇప్పటికే, డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్‌లు మరింత ఖరీదైనవిగా మారుతాయని పేమెంట్ యాప్స్ వినియోగదారులకు నోటిఫికేషన్‌లను వచ్చాయని అంటున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడే పాత ప్లాన్ల ధరలకు రీఛార్జ్ చేయమని అలర్ట్స్ వస్తున్నాయి. నిజంగానే రీఛార్జ్ రేట్లు పెరుగుతాయా అని షాక్ అవుతున్నారు.

Read Also : Telangana GP Polls-2025 : ఓటేయడానికి వెళ్తున్నారా.. ఓటర్ కార్డు లేకపోతే ఈ 12 కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లొచ్చు.. అన్నీ ఐడీ ఫ్రూఫ్ కిందే లెక్క..!

ఫైనాన్స్ పేమెంట్ యాప్‌లు, రీఛార్జ్ రేట్లు త్వరలో పెరుగుతాయంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు సాధ్యమైనంత తొందరగా రీఛార్జ్ ధరలను పెంచేయాలని టెలికం కంపెనీలు చూస్తున్నాయనే వార్తల నేపథ్యంలో వినియోగదారులు సైతం ఆందోళన చెందుతున్నారు. అధికారిక ప్రకటన లేకుండా ఈ హెచ్చరికలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

రూ. 199 ప్లాన్ రూ. 222కు పెరగొచ్చు :
నివేదికల ప్రకారం.. టెలికాం రీఛార్జ్ ప్లాన్లలో భారీగా పెరుగుదల ఉండవచ్చు. రూ. 199 నెలవారీ ప్లాన్ దాదాపు రూ. 222కు పెరిగే అవకాశం ఉంది. అయితే, రూ. 899 లాంగ్ టైమ్ ప్లాన్ దాదాపు రూ. 1006గా ఉంటుందని అంచనా. జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే కొన్ని చౌకైన (రోజుకు 1GB) ప్లాన్‌లను తొలగించాయి. దాంతో ఈ రెండు టెలికం కంపెనీల టారిఫ్ ధరలు కూడా సూచించాయి. పెరుగుతున్న ఖర్చులను కవర్ చేయడం, 5G విస్తరణ కోసం నిధులను సేకరించాల్సి ఉండటంతో వోడాఫోన్ ఐడియా (Vi) కూడా భారీగా టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉంది.

ఎయిర్‌టెల్ రెండు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను రూ. 121, రూ.181 ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే నిలిపివేయడం కస్టమర్లను నిరాశకు గురిచేసింది. తక్కువ ధరలో 30 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన బెనిఫిట్స్ అందించే ఈ ప్లాన్‌లను ఒక్కసారిగా ఎత్తేసింది. దాంతో ఎయిర్‌టెల్ యూజర్లకు తక్కువ రీఛార్జ్ ఆప్షన్లు ఉన్నాయి. ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. అతి త్వరలో టారిఫ్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.