Moto G04 Launch India : కొత్త 5జీ ఫోన్ కొంటున్నారా? మోటో G04 వచ్చేస్తోంది.. ఈ నెల 15నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto G04 Launch India : ఫిబ్రవరి 15న భారత మార్కెట్లో సరసమైన ధరలో మోటో G04ని లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Moto G04 to launch in India on February 15

Moto G04 Launch India : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటరోలా భారత మార్కెట్లో సరసమైన ఫోన్లను లాంచ్ చేసి చాలాకాలమైంది. అందులోనూ రూ. 10వేల లోపు సరసమైన ధరలో మోటో ఫోన్ చూసిందే లేదు.

అయితే, మోటో స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇప్పుడు మోటో జీ04 కొత్త 5జీ ఫోన్ మోడల్ భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ జాబితా ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. దీని ప్రకారం.. ఫిబ్రవరి 15న దేశ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.

Read Also : Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.50వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 13 సొంతం చేసుకోండి

ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం.. :
మోటో జీ04 ఫిబ్రవరి 15వ తేదీన భారతీయ మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఈ 5జీ ఫోన్ మొత్తం 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తోంది. అందులో 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్ వంటి ఉండనున్నాయి. ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది. మోటోరోలా మోటో పేరును బహిర్గతం చేయలేదు. కానీ, రాబోయే ఫోన్ లాంచ్ గురించి అనేక వివరాలను రివీల్ చేసింది. అయితే, మోటో జీ04 మోడల్ కావచ్చు.

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. :
ఈ 5జీ ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనుంది. ఈ ఫోన్‌కు యూనిసోక్ టీ606 ప్రాసెసర్ మరింత పవర్ అందిస్తుంది. బ్యాక్ సైడ్ 16ఎంపీ ఏఐ కెమెరా, పోర్ట్రెయిట్ మోడ్‌ను కలిగి ఉంది. స్టోరేజ్ వారీగా పరిశీలిస్తే.. వరుసగా 64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్‌, 4జీబీ లేదా 8జీబీ ర్యామ్ మధ్య ఆప్షన్లు ఉండవచ్చు. మైక్రోసైట్‌ ప్రకారం.. ఈ మోటో ఫోన్ 15జీబీ వరకు ర్యామ్ సపోర్టు ఇస్తుంది. సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా రన్ అవుతుంది.

Moto G04 launch 

దీర్ఘకాల వినియోగానికి మోటో జీ04 ఫోన్ భారీ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. గ్లోబల్ వేరియంట్ 10డబ్ల్యూ ఛార్జింగ్‌ను అందిస్తున్నప్పటికీ, భారతీయ వేరియంట్‌కు ఛార్జింగ్ స్పీడ్ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా వెల్లడించలేదు. అంతేకాకుండా, మోటో జీ04 మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, డాల్బీ అట్మోస్‌తో అమర్చబడి ఉంది.

ధర విషయానికొస్తే.. :
భారతీయ మార్కెట్‌లో ఈ మోటో 5జీ ఫోన్ ధర ఎంత ఉంటుందో వెల్లడించలేదు. యూరోప్‌లో ఈయూఆర్ 119 (సుమారు రూ. 10,751) ధర ట్యాగ్‌తో ఇటీవల లాంచ్ అయింది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బలమైన పోటీదారుగా నిలువనుంది. బ్యాంక్‌ ఆఫర్లతో పనిలేకుండా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్ల కోసం ఈ మోటో జీ04 ఫోన్ త్వరలో అందుబాటులోకి రానుంది.

Read Also : Flipkart Valentine Week Sale : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 12వేలకు పైగా డిస్కౌంట్..

ట్రెండింగ్ వార్తలు