Moto G24 Power With 6,000mAh Battery, MediaTek Helio G85 SoC Launched
Moto G24 Power Launched : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ప్రముఖ లెనోవో యాజమాన్యంలోని బ్రాండ్ నుంచి లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా మోటో G24 పవర్ మోడల్ మంగళవారం (జనవరి 30) లాంచ్ అయింది.
ఈ కొత్త మోటో జీ-సిరీస్ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీపై రన్ అవుతుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తుంది. 90హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐపీ52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. యాక్రిలిక్ గ్లాస్ బిల్డ్ కలిగి ఉంది. 50ఎంపీ మెయిన్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. మోటో జీ24 పవర్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
భారత్‌లో మోటో జీ24 పవర్ ధర, లభ్యత :
భారత మార్కెట్లో మోటో జీ24 పవర్ బేస్ 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 ఉంటుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 9,999కు పొందవచ్చు. ఈ ఫోన్ గ్లేసియర్ బ్లూ, ఇంక్ బ్లూ కలర్‌వేస్‌లో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, (Motorola.in) ద్వారా అలాగే దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఫిబ్రవరి 7 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. మోటో జీ24 పవర్‌పై లాంచ్ ఆఫర్‌లలో పాత డివైజ్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి రూ.750 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఇది ప్రారంభ ధర ట్యాగ్‌ని రూ. 8,249కు అందిస్తుంది. ఇంకా, ఈఎంఐ ఆప్షన్లు రూ.317 నుంచి ప్రారంభమవుతాయి.
మోటో జీ24 పవర్ స్పెసిఫికేషన్లు :
డ్యూయల్ సిమ్ (నానో) మోటో జీ24 పవర్ ఆండ్రాయిడ్ 14 పై (My UX)తో రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 537నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద మోటోరోలా ఫోన్ 8జీబీ వరకు ఎల్‌పీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీని కలిగి ఉంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీతో ఆన్‌బోర్డ్ మెమరీని 16జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో 3డి యాక్రిలిక్ గ్లాస్ బిల్డ్ ఉంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటో జీ24 పవర్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రాథమిక కెమెరా ఎఫ్/2.4 ఎపర్చరుతో 2ఎంపీ మాక్రో షూటర్‌తో ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లు ఎఫ్/2.45 ఎపర్చర్‌తో 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ద్వారా పొందవచ్చు. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు.
Moto G24 Power 6,000mAh Battery Launched
మోటో జీ24 పవర్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్, జీపీఎస్, ఎ-జీపీఎస్, జీఎల్ఓఎన్ఏఎస్ఎస్, గెలీలియో, ఎల్‌టీఈపీపీ, ఎస్‌యూపీఎల్, Beidu, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, వై-ఫై802.11 a/b/g/n/ac, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఐపీ52-రేటెడ్ వాటర్-రిపెల్లెంట్ బిల్డ్‌లో వస్తుంది. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, ఇ-కంపాస్, గైరోస్కోప్, సెన్సార్ హబ్ ఎస్ఏఆర్ సెన్సార్ ఉన్నాయి.
బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ద్వారా సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మోటోరోలా మోటో జీ24 పవర్‌ను 33డబ్ల్యూ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో అమర్చింది. దీని కొలతలు 163.49×74.53×8.99ఎమ్ఎమ్, బరువు 197 గ్రాములు ఉంటుంది.