Moto G56 5G launch
Moto G56 5G : ప్రముఖ మోటోరోలా మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మోటో G56 5Gతో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఆగస్టు 2024లో లాంచ్ అయిన మోటో G55 5Gకి అప్‌గ్రేడ్‌తో కానుంది. అధికారిక వివరాలు లేనప్పటికీ, ఈ హ్యాండ్‌సెట్ డిజైన్, స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ఇటీవలి నివేదిక ప్రకారం.. మోటో G56 5G పాంటోన్ బ్లాక్ ఆయిస్టర్, పాంటోన్ గ్రే మిస్ట్, పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ డిల్ అనే 4 కలర్ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది.
మోటో G56 5G లాంచ్, ధర (అంచనా) :
భారత మార్కెట్లో మోటోరోలా మోటో G55 5G ఇంకా లాంచ్ కాలేదు. మోటో G56 5Gకి కూడా అదే విధంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 2025 నాటికి ప్రపంచ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 8+256GB కాన్ఫిగరేషన్ ధర సుమారు రూ. 24వేలు ఉంటుందని అంచనా.
మోటో G56 5G స్పెసిఫికేషన్లు (అంచనా) :
లీక్‌ల ప్రకారం.. మోటో G56 5G స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో 6.72-అంగుళాల LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్ వరకు గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్ ద్వారా 8GB వరకు LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.
మోటో G56 5G ఆండ్రాయిడ్ 15-ఆధారిత హలో యూఐపై రన్ అవుతుందని భావిస్తున్నారు. ఆప్టిక్స్ విషయానికొస్తే.. 50mp మెయిన్ సోనీ LYT-600 కెమెరా, చదరపు కెమెరా ఐలండ్ 8mp అల్ట్రావైడ్ సెన్సార్‌తో రావచ్చు.
ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ షూటర్ ఉండవచ్చు. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాటరీతో కూడా వస్తుందని భావిస్తున్నారు.