Realme GT 7 Series : గేమింగ్ యూజర్లకు పండగే.. అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మి GT 7 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme GT 7 Series : గేమింగ్ యూజర్ల కోసం రియల్‌మి GT 7 సిరీస్ వచ్చేస్తోంది. ఈ కొత్త లైనప్ ధర, స్పెషిఫికేషన్లు వివరాలను ఓసారి లుక్కేయండి..

Realme GT 7 Series : గేమింగ్ యూజర్లకు పండగే.. అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మి GT 7 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme GT 7 Series

Updated On : May 6, 2025 / 6:08 PM IST

Realme GT 7 Series : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. రియల్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను అతి త్వరలో భారత మార్కెట్లో రిలీజ్ కానుంది.

రియల్‌మి GT 7 సిరీస్‌ లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త లైనప్ త్వరలో వస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పవర్ బ్యాంక్ పెద్ద బ్యాటరీతో రానుంది.

Read Also : Nothing Phone (2a) 5G : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ (2a) ధర తగ్గిందోచ్.. సరసమైన ధరకే ఇలా కొనేసుకోండి..!

కచ్చితమైన లాంచ్ తేదీ రివీల్ చేయనప్పటికీ, రియల్‌మి ఫోన్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. రాబోయే లైనప్‌లో రియల్‌మి GT 7తో సహా రెండు మోడళ్లు ఉంటాయని భావిస్తున్నారు.

రియల్‌మి GT 7 సిరీస్ లాంచ్, స్పెసిఫికేషన్లు (అంచనా) :
అమెజాన్ ఇండియాలో రాబోయే రియల్‌మి GT 7 లాంచ్, లభ్యతను ధృవీకరించింది. లో డిజైన్, కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా టీజ్ చేసింది.

రాబోయే స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ కోసం గ్రాఫేన్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఐసీ బ్లూ కలర్ బ్యాక్ ప్యానెల్‌లో భారీ కెమెరా ఐలాండ్‌తో వస్తోంది. కంపెనీ 10,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని టీజ్ చేసింది.

అమెజాన్ లాంచ్ పేజీలో రియల్‌మి GT 7 సిరీస్‌ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) డెవలపర్ క్రాఫ్టన్‌తో కలిసి టెస్టింగ్ చేసినట్టు కూడా పేర్కొంది.

ఈ ఫోన్ 6 గంటల వరకు 120fps BGMI గేమ్‌ప్లేను అందిస్తుందని పేర్కొన్నారు. రియల్‌‌మి GT 7 సిరీస్ BIS సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించినట్లు తెలుస్తోంది.

ఈ లైనప్‌లో రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T అనే 2 మోడళ్లు ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు వరుసగా RMX5061, RMX5085 మోడల్ నంబర్‌లతో వస్తాయి. లిస్టింగ్ మరిన్ని వివరాలను వెల్లడించనప్పటికీ, రియల్‌మి GT 7 డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్‌ను కలిగి ఉండొచ్చు.

రియల్‌మి GT 7 సిరీస్ ధర (అంచనా) :
రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు మిడ్-రేంజ్ సెగ్మెంట్ ధర నిర్ణయించే అవకాశం ఉంది. రియల్‌మి GT 7 ధర రూ.45వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Vivo V50 Lite 5G : అమెజాన్ బంపర్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే వివో V50 లైట్ 5జీ ఫోన్.. ఇప్పుడే కొనేసుకోండి!

ఈ హ్యాండ్‌సెట్ రూ.38,999 ప్రారంభ ధరకు రియల్‌మి GT 6 స్థానంలోకి రావచ్చు. రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T గత ఏడాది నవంబర్‌లో భారత మార్కెట్లో రియల్‌మి GT 7 ప్రోలో చేరనున్నట్లు చెబుతున్నారు.