Upcoming Flagship Phones : కొత్త ఏఐ చిప్‌సెట్‌తో రానున్న లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే బ్రాండ్ల మోడల్స్ ఉన్నాయంటే?

Upcoming Flagship Phones : సరికొత్త ఏఐ క్వాల్‌కామ్ స్నాప్‌ డ్రాగన్ 8ఎస్ జెనరేషన్ 3 (SoC) చిప్‌సెట్ టెక్నాలజీతో అతి త్వరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రాబోతున్నాయి. ఏయే బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

Upcoming Flagship Phones : కొత్త ఏఐ చిప్‌సెట్‌తో రానున్న లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే బ్రాండ్ల మోడల్స్ ఉన్నాయంటే?

Moto X50 Ultra, Xiaomi Civi 4 Pro, and More Phones Confirmed to Launch

Upcoming Flagship Phones : ఏఐ టెక్నాలతో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఫోన్ తయారీదారులు ప్లాన్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు మార్కెట్లో డిమాండ్ ఆధారంగా చిప్‌సెట్ టెక్నాలజీ కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నాయి చిప్ తయారీ కంపెనీలు. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీతో కూడిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌ను మార్చి 18న ప్రకటించారు. ఈ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ అత్యంత సరసమైన వెర్షన్ అని చెప్పవచ్చు.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

గత ఏడాదిలోనే ఈ చిప్‌సెట్ ఆవిష్కరించగా అనేక ఫ్లాగ్‌షిప్-లెవల్ స్మార్ట్‌ఫోన్‌లలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. సరికొత్త, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-బ్యాక్డ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీ చిప్‌సెట్ ఆవిష్కరించిన తర్వాత అనేక బ్రాండ్‌లు తమ రాబోయే కొన్ని ఫ్లాగ్‌షిప్ మోడళ్ల కోసం 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అందించనున్నట్టు వెల్లడించాయి. ఈ కొత్త SoC చిప్‌సెట్‌తో రానున్న కొన్ని స్మార్ట్‌ఫోన్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

మోటో ఎక్స్50 అల్ట్రా :
రాబోయే మోటో ఎక్స్50 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా అందించనున్నట్టు మోటోరోలా ధృవీకరించింది. ఈ మోడల్‌ ఏఐ మొబైల్ ఫోన్‌గా రానుంది. చైనా వెలుపల మార్కెట్లో ఈ మోడల్ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోగా వచ్చే అవకాశం ఉంది. భారత్ సహా కొన్ని ప్రపంచ మార్కెట్లలో ఈ కొత్త అల్ట్రా ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా. అమెరికాలో ఈ కొత్త మోడల్మోటోరోలా ఎడ్జ్ ప్లస్ (2024) పేరుతో లాంచ్ కానుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ భారత మార్కెట్లో 6.7-అంగుళాల 1.5కె రిజల్యూషన్ 144హెచ్‌జెడ్ డిస్‌ప్లేతో 2,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 3 కలర్ ఆప్షన్‌లతో లాంచ్ కానుంది.

షావోమీ సివి 4 ప్రో :
షావోమి సివి 4 ప్రో ఫోన్ మోడల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెనరేషన్ 3 చిప్‌సెట్‌తో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని షావోమీ వెయిబో పోస్ట్‌లో ప్రకటించింది. ఈ మోడల్ కంపెనీ (HyperOS) యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇతర వివరాలను షావోమీ వెల్లడించలేదు. అయితే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ సైట్‌లో మోడల్ నంబర్ (24053PY09I)తో షావోమీ మోడల్ గుర్తించారు. ఈ హ్యాండ్‌సెట్ భారత మార్కెట్లో షావోమీ 14 లైట్‌తో, చైనాలో షావోమీ సివి 4గా లాంచ్ కానుంది. కానీ, కంపెనీ ఈ రెండు మోడళ్లను ధృవీకరించలేదు.

రెడ్‌మి నోట్ 13 టర్బో :
రాబోయే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 13 టర్బో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీతో వస్తుందని చైనా సోషల్ మీడియా వెల్లడించింది. అయితే, కంపెనీ మోడల్ పేరును ధృవీకరించలేదు. అది ‘రెడ్‌మి న్యూ సిరీస్’ అనే ట్యాగ్‌తో టీజర్ రివీల్ చేసింది. ఇటీవల ఆన్‌లైన్‌లో లీక్ అయిన రెడ్‌మి నోట్ 13 టర్బో అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మోడల్‌ను చైనా వెలుపల దేశాల మార్కెట్లో పోకో F6 అనే పేరుతో లాంచ్ చేయనున్నట్టు టీజర్ వెల్లడించింది. రెడ్‌మి నోట్ 13 టర్బో ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్‌ఓఎస్‌‌పై రన్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే, 6.78-అంగుళాల 144హెచ్‌జెడ్ 1.5కె ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఐక్యూ జెడ్9 టర్బో :
వచ్చే ఏప్రిల్‌లో చైనాలో ఐక్యూ జెడ్9 సిరీస్ రాబోతుంది. అయితే, కొత్తగా లాంచ్ అయిన స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో వస్తుందని ఐక్యూ కంపెనీ పేర్కొంది. ఈ లైనప్‌లో రాబోయే మోడల్‌లను సంస్థ వెల్లడించలేదు. కానీ, ఐక్యూ బేస్ మోడల్ జెడ్9 5జీ ఇటీవల భారత మార్కెట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీతో వచ్చింది. గత ఆన్‌లైన్ లీక్‌ల ప్రకారం.. ఐక్యూ జెడ్9 టర్బో మోనికర్‌ను కలిగిన మోడల్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీ కలిగి ఉండవచ్చు. టర్బో మోడల్ 1.5కే డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాదు.. 6,000ఎంఎహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది.

Read Also : Poco X6 Neo 5G Sale : పోకో X6 నియో 5జీ ఫోన్ ఫస్ట్ సేల్.. అత్యంత సరసమైన ధరకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు!