JioAirFiber Plans : జియో యూజర్లకు అదిరే ఆఫర్.. ఎయిర్‌ఫైబర్ ప్లాన్లపై 30శాతం డిస్కౌంట్.. ఎప్పటివరకంటే?
JioAirFiber Plans : ఈ ఆఫర్ జూలై 26 నుంచి ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. 30 శాతం ఫ్రీడమ్ ఆఫర్‌తో జియో 3 నెలల జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ అందిస్తోంది.
JioAirFiber Plans : రిలయన్స్ జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లపై కొత్త ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో రూ. 1,000 ఇన్స్టాలేషన్ ఛార్జీ మినహాయింపుతో జియో ఎయిర్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇన్‌స్టాలేషన్‌పై 30 శాతం తగ్గింపును అందిస్తోంది. జియో కొత్త వినియోగదారులకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.
Read Also : Jio New Annual Plan : జియో యూజర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్లు.. నెలకు రూ.276.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!
మీరు ఇప్పటికే ఉన్న జియో ఎయిర్‌ఫైబర్ యూజర్ అయితే, కొత్త ప్లాన్‌ను కొనుగోలు చేసినా లేదా మరొకదానికి అప్‌గ్రేడ్ చేసినా మీరు ఆఫర్‌కు అర్హులు కాలేరు. జియో అందిస్తున్న 30 శాతం తగ్గింపు రూ. 1,000 ఇన్స్టాలేషన్ ఛార్జీ మినహాయింపుతో పాటు కొత్త యూజర్లకు కూడా వర్తిస్తుంది. మీరు ప్రస్తుతం జియో ఎయిర్‌ఫైబర్ కోసం మాత్రమే బుకింగ్ చేస్తే.. ఇంకా బ్రాడ్‌బ్యాండ్ ఇన్స్టాల్ చేయకపోతే మీరు కూడా ఆఫర్‌ను పొందవచ్చు.
జూలై 26 నుంచి ఆగస్టు 15 వరకు ఆఫర్లు :
జియో అందించే ఫ్రీడమ్ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమేనని టెలికం దిగ్గజం తెలిపింది. ఈ ఆఫర్ జూలై 26 నుంచి ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. 30 శాతం ఫ్రీడమ్ ఆఫర్‌తో జియో 3 నెలల జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ అందిస్తోంది. సాధారణంగా ప్లాన్‌కు రూ. 2121, ఇన్‌స్టాలేషన్‌కు రూ. 1,000.. అంటే మొత్తం రూ. 3121 చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 15 వరకు రూ. 2121 ఖర్చు అవుతుంది. జియో ఎయిర్‌ఫైబర్ ధర, ఆకట్టుకునే వేగంతో వివిధ ఇంటర్నెట్ అవసరాల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తుంది.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ల ధరలివే :
ఈ జియో ఫైబర్ ప్లాన్లను ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ అనే రెండు ప్రధాన కేటగిరీలుగా విజభించింది. ఎయిర్ ఫైబర్ ప్లాన్ల ధర నెలకు రూ. 599, రూ. 899, రూ. 1199కు అందిస్తోంది. స్ట్రీమింగ్, గేమింగ్, బ్రౌజింగ్ కోసం పర్ఫెక్ట్ 100ఎంబీపీఎస్ వరకు స్పీడ్ అందిస్తుంది. ఈ ప్లాన్లలో 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది, టాప్-టైర్ రూ. 1199 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోసినిమా ప్రీమియమ్లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్లను అందిస్తుంది.
హైస్పీడ్ అవసరమయ్యే వారికి ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్లు నెలకు రూ. 1499, రూ. 2499, రూ. 3999తో ప్రీమియం ఆప్షన్లను అందిస్తాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ సేవలకు సబ్స్క్రిప్షన్లతో పాటుగా డిజిటల్ ఛానెల్‌లు, ఓటీటీ యాప్‌లకు 1జీబీపీఎస్ వరకు స్పీడ్ అందిస్తాయి.
అదనంగా, జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు పేరంట్ కంట్రోల్స్, వై-ఫై 6 సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్‌ను కలిగి ఉంటాయి. కొత్త కనెక్షన్ సెటప్‌తో కస్టమర్లు 6 నెలల లేదా 12 నెలల ప్లాన్‌ని ఎంచుకోవచ్చు, వార్షిక ప్లాన్‌తో రూ. 1000 ఇన్స్టాలేషన్ రుసుమును చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Read Also : Reliance Jio Plans : జియో యూజర్లకు పండగే.. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. మరెన్నో బెనిఫిట్స్ కూడా!