Peral Millet Cultivation : వర్షాభావ పరిస్థితుల్లో సజ్జ సాగే మేలు

Peral Millet Cultivation : అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన బెట్ట పరిస్థితులను తట్టుకుని, తక్కువ నీటితో, అతి తక్కువ పెట్టుబడితో పండే పంట సజ్జ. ఖరీఫ్ లో వర్షాధారంగా జూన్, జూలై నెలల్లోను, రబీలో వేసవి పంటగా జనవరిలో సజ్జసాగుకు అనుకూల వాతావరణం వుంటుంది.

Peral Millet Cultivation : వర్షాభావ పరిస్థితుల్లో సజ్జ సాగే మేలు

Peral Millet Cultivation

Updated On : July 27, 2024 / 4:29 PM IST

Peral Millet Cultivation : జొన్న తరువాత అధికంగా సాగయ్యే పంట సజ్జ. తెలుగు రాష్ట్రాల్లో 1 లక్షా 70 వేల ఎకరాల్లో సాగవుతుంది. తక్కువ వర్షపాతం.. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో కూడా అదిక దిగుబడిని ఈ పంట ద్వారా తీసుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన హైబ్రిడ్ రకాలతో ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని పొందే వీలుంది. అయితే సజ్జ సాగుచేయాలనుకునే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితేనే అధిక దిగుబడిని పొందగలరని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త  శశిభూషణ్.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన బెట్ట పరిస్థితులను తట్టుకుని, తక్కువ నీటితో, అతి తక్కువ పెట్టుబడితో పండే పంట సజ్జ. ఖరీఫ్ లో వర్షాధారంగా జూన్, జూలై నెలల్లోను, రబీలో వేసవి పంటగా జనవరిలో సజ్జసాగుకు అనుకూల వాతావరణం వుంటుంది.  ప్రస్థుత ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల, నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా ఆగష్టు రెండవ పక్షం వరకు ఈ పంటను విత్తుకునే వీలుంది. మన దేశంలో మొక్కజొన్న, జొన్న తర్వాత ముఖ్యంగా పండే ముతక ధాన్యం పంటల్లో సజ్జను ప్రధానంగా చెప్పుకోవచ్చు.

ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సజ్జ ఉత్పత్తి అధికంగా వుంది. మన ప్రాంతంలో సజ్జ విస్తీర్ణం నానాటికీ తరిగిపోతోంది. చాలా  ప్రాంతాల్లో సంప్రదాయ రకాలనే ఎక్కువగా సాగుచేయటం వల్ల దిగుబడి నామమాత్రంగా ఉండటంతో  రైతులకు ఆర్ధిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే పలు ప్రభుత్వ, ప్రైవేటు హైబ్రిడ్ రకాలు అందుబాటులో వున్నప్పటికీ, ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగు ఉత్తరాంధ్ర, తెలంగాణా జిల్లాల్లో, ఏజన్సీ ప్రాంతాలకే ఎక్కువ పరిమితం కావటంతో  దీని విస్తరణ నామమాత్రంగా ఉంది.

అయితే, చిరుధాన్యాల వాడకం పట్ల పెరిగిన అవగాహన, దేశీయంగా పెరిగిన డిమాండ్ వల్ల, సజ్జ పంట, సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే సారవంతమైన నేలల్లో సాగుచేస్తే సజ్జ పంటతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చని సాగు వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శశిభూషణ్.

Read Also : Vermicompost Production : కల్పతరువుగా సేంద్రియ ఎరువులు.. వర్మీకంపోస్ట్ తయారీతో స్వయం ఉపాధి పొందుతున్న రైతు