ఈ రెండు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్‌? మీరైతే ఏది కొంటారు? వీటి మధ్య తేడాలు ఇవిగో..

ధరలు, రిజల్యూషన్, డిస్ప్లే ఎలా ఉన్నాయో తెలుసా?

ఈ రెండు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్‌? మీరైతే ఏది కొంటారు? వీటి మధ్య తేడాలు ఇవిగో..

Updated On : May 11, 2025 / 7:22 PM IST

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? రూ.22లోపు బడ్జెట్‌లో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని మీరు భావిస్తుంటే మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G, రియల్‌మీ నార్జో 80 ప్రో 5G గురించి తెలుసుకోవాల్సిందే.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కు పోటీగా రియల్‌మీ నార్జో 80 ప్రో 5G ని భారత మార్కెట్లోకి విడుదలైంది. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 6.7 అంగుళాల సైజులో 1.5K కర్వ్డ్ పీవోఎల్‌ఈడీ స్క్రీన్‌తో వచ్చింది. రియల్‌మీ నార్జో 80 ప్రో 5G లోని డిస్ప్లే 6.77 అంగుళాలు. రియల్‌మీ నార్జో 80 ప్రో 5G, మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఫీచర్లు వివరంగా చూద్దాం..

ధరలు
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,999, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999. ఇక 8GB RAM, 128GB స్టోరేజ్ తో వచ్చిన రియల్‌మీ నార్జో 80 ప్రో 5G మోడల్ ధర రూ.19,999. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.21,499. అలాగే, 12GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.23,499.

Also Read: ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఇదే.. ఈ రీతిలో గట్టిగా బదులిచ్చాం.. 100 మంది ఉగ్రవాదులు, 40 మంది పాక్ ఆర్మీ సిబ్బంది హతం: డీజీఎంవో

రిజల్యూషన్, డిస్ప్లే
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్మార్ట్‌ఫోన్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1220 x 2712 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్ ఉంది. ఇక రియల్‌మీ నార్జో 80 ప్రో 5Gలో 6.77-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ ఉంటుంది.

ప్రాసెసర్
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంది. రియల్‌మీ నార్జో 80 ప్రో 5G MediaTek Dimensity 7400 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

బ్యాటరీ
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్మార్ట్‌ఫోన్‌లో 5,500mAh బ్యాటరీ 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం ఉంటుంది. రియల్‌మీ నార్జో 80 ప్రో 5Gలో 6000mAh బ్యాటరీ 65W రివర్స్ ఛార్జింగ్, 80W వైర్డ్ ఛార్జింగ్ ఉంది.

కెమెరా
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G బ్యాక్‌సైడ్ f/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ LYT700C ప్రైమరీ కెమెరా, సెకండరీ 13-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. అలాగే, స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్‌ సైడ్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

రియల్‌మీ నార్జో 80 ప్రో 5Gలో OIS సామర్థ్యంతో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

ఇక మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G 161 మి.మీ పొడవు, 73 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 180 గ్రాముల బరువు ఉంటుంది. రియల్‌మీ నార్జో 80 ప్రో 5Gలో 162.75 మి.మీ పొడవు, 74.92 మి.మీ వెడల్పు, 7.55 మి.మీ మందం, 179 గ్రాముల బరువు ఉంటుంది.