Moto G04 Launch : ప్రీమియం ఫీచర్లతో మోటో జీ04 ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ.6,249 మాత్రమే!

Motorola Moto G04 Launch : మోటరోలా ప్రీమియం ఫీచర్లతో కూడిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ04ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.

Motorola launches Moto G04 in India, price starts at Rs 6,249

Motorola Moto G04 Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జీ04 మోడల్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఐపీఎస్ ఎల్‌సీడీ పంచ్-హోల్ డిస్‌ప్లే 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతోంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. రూ. 6,249 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది.

భారత్‌లో మోటో జీ04 ధర ఎంతంటే? :
మోటో జీ04 సిరీస్‌ను కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ అనే నాలుగు కలర్ వేరియంట్లలో అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాక్రిలిక్ గ్లాస్ (PMMA) ఫినిషింగ్‌తో కూడిన మ్యాట్ షేప్ కలిగి ఉంటుంది. తద్వారా గీతలు పడవు.

Read Also : Tata Tiago EV Price Drop : టాటా టియాగో ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.70వేల వరకు తగ్గింపు.. కొత్త ధర ఎంతంటే?

మోటో జీ04 ఫోన్ రెండు మెమరీ, స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర వరుసగా రూ.6,249, రూ.7,999కు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, భారత మార్కెట్లోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఫిబ్రవరి 22, 2024 నుంచి మధ్యాహ్నం 12గంటలకు సేల్ ప్రారంభం కానుంది.

మోటో జీ04 స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : మోటో జీ04 మోడల్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కెమెరా కటౌట్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వెలుతురును బట్టి ఫోన్ కలర్ ఎడ్జెస్ట్ అవుతుంది. సౌండ్ క్వాలిటీని అందించే డాల్బీ అట్మోస్ స్పీకర్‌ను కూడా కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ : మోటో జీ04 ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. వినియోగదారులు తమ డివైజ్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. సురక్షితంగా యాక్సెస్ చేసుకోగల ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఓఎస్ (OS)లో హెల్త్, సెక్యూరిటీ, డేటా కోసం ప్రైవసీ అప్‌డేట్స్ కూడా కలిగి ఉంది.

పర్ఫార్మెన్స్- స్టోరేజీ : మోటో జీ04 ఫోన్ 8జీబీ లేదా 4జీబీ ర్యామ్ కలిగి ఉంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్‌తో 16జీబీ పెంచుకోవచ్చు. యూనిసోక్ టీ606 చిప్‌సెట్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ని కలిగి ఉంది. 64జీబీ లేదా 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో 1టీబీకి విస్తరించవచ్చు. ఇందులో 3 సిమ్ కార్డులకు స్లాట్ కూడా ఉంది.

బ్యాటరీ, కెమెరా : మోటో జీ04 ఫోన్ 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 15డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 16ఎంపీ బ్యాక్ కెమెరా, ఏఐని ఉపయోగించి 5ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. హెచ్‌డీఆర్, పోర్ట్రెయిట్ మోడ్, టైమ్‌లాప్స్, నైట్ విజన్, లెవెల్లర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Read Also : Vivo V30 Pro Launch : ఈ నెల 28నే వివో V30 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్!

ట్రెండింగ్ వార్తలు