Motorola Razr 50 Ultra price (Image Credit To Original Source)
Motorola Razr 50 Ultra : కొత్త ఫోన్ కొంటున్నారా? జనవరి 16న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో అనేక ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. మీ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.
అయితే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌కు ముందు మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ధర రూ.39వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మోటోరోలా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ 4-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇంతకీ అమెజాన్ సేల్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ధర ఎంతంటే? :
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ అసలు ధర రూ.99,999 ఉంటే.. రూ. 39,009 ఫ్లాట్ డిస్కౌంట్‌తో ఇప్పుడు రూ.60,990కి కొనేసుకోవచ్చు. అదనంగా, కొన్ని బ్యాంక్ కార్డులతో కస్టమర్లు రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ 5శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
Motorola Razr 50 Ultra price (Image Credit To Original Source)
అంతేకాదు.. నెలకు రూ.2,144 నుంచి ఫ్రీ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే రూ.42వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. అది కూడా మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్, మోడల్ బట్టి రేటు ఎక్కువగా లేదా తక్కువగా ఉండొచ్చు.
Read Also : Samsung Galaxy S25 5G : బిగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఎంత తగ్గిందో తెలుసా?
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫీచర్లు :
మోటోరోలా రేజర్ 50 అల్ట్రాలోని 4-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ కవర్ డిస్‌ప్లే 165Hz వరకు రిఫ్రెష్ రేటు అందిస్తుంది. అదనంగా, స్క్రీన్ గరిష్టంగా 2400 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ మడతబెట్టే ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే 165Hz వరకు రిఫ్రెష్ రేటుతో లోపలి డిస్‌ప్లే 6.9-అంగుళాలతో కనిపిస్తుంది. అదనంగా, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 సీపీయూ గాడ్జెట్‌కు పవర్ అందిస్తుంది.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రాలో 50MP ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. అదనంగా, ఫోన్ 4000mAh బ్యాటరీతో వస్తుంది. 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.