Motorola Razr 60 Ultra : ఖతర్నాక్ డీల్ మావా.. ఈ మోటోరోలా ఫ్లిప్ ఫోన్‌పై రూ. 30వేలు డిస్కౌంట్.. ఈ క్రేజీ ఆఫర్ మళ్లీ రాదు!
Motorola Razr 60 Ultra : మోటోరోలా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Motorola Razr 60 Ultra
- మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా
- ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా ఆప్షన్
- 4,700mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా
Motorola Razr 60 Ultra : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. మీరు మోటోరోలా రేజర్ 60 అల్ట్రాను కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.
బ్యాంక్ ఆఫర్లతో ఈ మోటోరోలా ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. మోటోరోలా రేజర్ 60 అల్ట్రాలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మోటోరోలా రేజర్ 60 అల్ట్రాపై డీల్స్, ఆఫర్లను వివరంగా తెలుసుకుందాం..
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ధర, ఆఫర్లు :
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 16GB/512GB స్టోరేజ్ వేరియంట్ (Motorola Razr 60 Ultra) అమెజాన్‌లో రూ. 79,999 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ గత ఏడాది మే నెలలో రూ. 99,999 ధరకు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ. 10,500 ఫ్లాట్ ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. తద్వారా ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 69,499 అవుతుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారుగా రూ. 30,500 తక్కువకే లభిస్తుంది.
Read Also : Nothing Phone 3 : ఇది కదా ఆఫర్.. అమెజాన్‌లో రూ. 80వేల నథింగ్ ఫోన్ జస్ట్ రూ. 45వేలకే.. కొనాలా? వద్దా?
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
మోటోరోలా రేజర్ 60 అల్ట్రాలో 1224×2992 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 7-అంగుళాల 1.5K pOLED ఎల్టీపీఓ ఫోల్డబుల్ ప్రైమరీ డిస్ప్లే ఉంది. 1272×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ 4-అంగుళాల pOLED ఎల్టీపీఓ కవర్ డిస్ప్లే కూడా ఉంది.
రేజర్ 60 అల్ట్రా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 4,700mAh బ్యాటరీ ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
సేఫ్టీ కోసం ఈ ఫ్లిప్ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP48 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, బ్లూటూత్ 5.4, NFC, GPS, Wi-Fi 7, సింగిల్ USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
