Aadhaar ATM service : మీకు అర్జెంటుగా డబ్బు అవసరమా? ఆధార్ ఏటీఎం అంటే ఏంటి? ఇంటి దగ్గరే నగదు విత్‌డ్రా ఎలా చేసుకోవచ్చు!

Aadhaar ATM service : మీకు డబ్బులు అత్యవసరమా? అయితే, ఆధార్ ఏటీఎం సర్వీసు సాయంతో ఇంటి దగ్గర నుంచే డబ్బులను తీసుకోవచ్చు తెలుసా? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Need urgent cash? Use Aadhaar ATM service to withdraw money from the comfort of your home

Aadhaar ATM service : మీకు అత్యవసరంగా నగదు అవసరమైతే.. బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఏటీఎం దగ్గరకు వెళ్లే సమయం లేదంటే.. మీరు ఇంట్లోనే కూర్చొని క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా ఆధార్ ఏటీఎం (AePS) సర్వీసు సౌకర్యాన్ని అందిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ ఐపీపీబీ పోస్టు ప్రకారం.. ‘అత్యవసర నగదు అవసరం పడిందా? బ్యాంకుకు వెళ్లే సమయం లేదా? అయితే, చింతించకండి.

Read Also : Xiaomi 14 Ultra Sale : భారత్‌లో షావోమీ 14 అల్ట్రా ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

(IPPBONLine) ఆధార్ ATM (AePS) సర్వీసుతో మీ ఇంటి నుంచే నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ పోస్ట్‌మాన్ ఇప్పుడు మీ ఇంటి వద్దే నగదును విత్‌డ్రా చేసుకోవడానికి మీకు సాయం చేస్తాడు. ఏఈపీఎస్ సౌకర్యం ద్వారా బ్యాంక్ కస్టమర్ తన ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి ఆధార్‌ను గుర్తింపుగా ఉపయోగించవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేయడం, నగదు ఉపసంహరణ, వ్యాపార కరస్పాండెంట్ ద్వారా చెల్లింపులు వంటి ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించవచ్చు.

ఏఈపీఎస్ (AePS) సర్వీసులు అందుబాటులోకి :
ఏఈపీఎస్ కింద అందుబాటులో ఉన్న సేవల్లో భాగంగా కస్టమర్ నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాలో బ్యాలెన్స్ గురించి తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ టు ఆధార్ చేయవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ సూచనల ప్రకారం.. ఏఈపీఎస్ పొందాలనుకునే కస్టమర్ తప్పనిసరిగా (AePS)లో పాల్గొనే బ్యాంక్‌తో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇతర బ్యాంక్‌లో కూడా ఆధార్‌ను ఆ అకౌంట్‌తో లింక్ చేయాలి. కస్టమర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ మాత్రమే ఉపయోగించి లావాదేవీ పూర్తి చేయగలరు.

ఇంటింటికి ఆన్‌లైన్ ఏటీఎం సర్వీసులను ఎలా పొందాలి? :

  • IPPB ఆన్‌లైన్ ఆధార్ ఏటీఎం సర్వీసు కోసం ఇలా ప్రయత్నించండి.
  • ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వెబ్‌సైట్‌ (https://www.ippbonline.com/web/ippb)కి లాగిన్ చేయండి
  • నావిగేషన్ బార్‌లో ‘Service Request’పై క్లిక్ చేయండి.
  • మీరు IPPB ఖాతాదారు అయితే ‘IPPB Customer’ ఎంచుకోండి లేదా IPPB కాని కస్టమర్‌లు ‘non-IPPB Customers’ని ఎంచుకోవచ్చు
  • ఇప్పుడు ‘Door Step Baking’పై క్లిక్ చేయండి
  • సర్వీసు రిక్వెస్ట్ ఫారమ్‌లో ‘ఆధార్ ఏటీఎం – ఏదైనా ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణ’ ఆప్షన్ ఎంచుకోండి
  • మొబైల్ నంబర్, ఇంటి నంబర్, సమీపంలోని పోస్టాఫీసు పిన్ కోడ్, ఇతర ముఖ్యమైన వివరాలను ఎంటర్ చేయండి
  •  (terms and conditions) బాక్సులో టిక్ చేయండి.
  • మీకు అక్కడ కనిపించే ‘text captcha’ని అలానే ఎంటర్ చేయండి
  • ‘Submit’పై క్లిక్ చేయండి.
  • సర్వీసు రిక్వెస్ట్ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత మీరు IPPB నుంచి రీసిప్ట్ మెసేజ్, ఆ తర్వాత ఏటీఎం సర్వీసు సమాచారాన్ని అందుకుంటారు.

కస్టమర్ ఆధార్ నంబర్‌ను తప్పుగా రిజిస్టర్ చేస్తే ఏమౌతుంది? :
ఎవరైనా కస్టమర్ ఆధార్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసినట్లయితే లేదా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ లేని తప్పు బ్యాంకును ఎంచుకుంటే.. మీరు ఏదైనా లావాదేవీ చేస్తే అది రిజక్ట్ అవుతుంది. కస్టమర్ తన ఆధార్‌ని మల్టీ బ్యాంకులతో లింక్ చేయవచ్చు. కస్టమర్ సరైన బ్యాంకును ఎంచుకోవాలి. లావాదేవీని నిర్వహించాలనుకునే ఖాతాదారుడు ఎంచుకున్న బ్యాంక్‌లో ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లను కలిగి ఉంటే.. ప్రాథమిక ఖాతా మాత్రమే డెబిట్ అవుతుంది. లావాదేవీ సమయంలో ఖాతాదారుడు బ్యాంక్ ఖాతాను ఎంపిక చేసుకోలేరని ఐపీపీబీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

కస్టమర్ ఆధార్ నంబర్‌తో మల్టీ అకౌంట్లను లింక్ చేస్తే ఏం చేయాలి :
ఖాతాదారుడు ఒకే బ్యాంకులో ఆధార్‌తో లింక్ అయిన మల్టీ అకౌంట్లను కలిగి ఉంటే.. (AePS) సర్వీసులో ఆధార్‌తో లింక్ అయిన ప్రైమరీ అకౌంటుతో మాత్రమే పనిచేస్తాయి. ప్రాథమిక ఖాతా లింకింగ్‌ను పేర్కొనడానికి/మార్చడానికి కస్టమర్ తన బ్యాంక్‌ని సంప్రదించాలి. అదేవిధంగా, అకౌంట్లు వేర్వేరు (మల్టీ) బ్యాంకులతో లింక్ అయితే.. (AePS) యాప్‌లో లావాదేవీ చేయాల్సిన బ్యాంకు పేరును ఎంచుకోవడానికి కస్టమర్‌కు ఆప్షన్ ఉంటుంది.

Read Also : Ola electric S1X Launch : 2024 ఓలా ఎలక్ట్రిక్ S1X అప్‌డేట్ వెర్షన్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 15నే లాంచ్..!

ట్రెండింగ్ వార్తలు