Netflix Subscribers : నెట్‌ఫ్లిక్స్‌లో పాస్‌వర్డ్ షేరింగ్‌ బ్యాన్ వర్కౌట్ అయింది.. కొత్తగా చేరిన 9.33 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు..!

Netflix Subscribers : స్ట్రీమింగ్ దిగ్గజం పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధం నేపథ్యంలో కొత్త సబ్‌స్క్రైబర్‌లు భారీ సంఖ్యలో పెరిగారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ అంచనాలను మించిపోయింది.

Netflix Subscribers : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్ చేసిన తర్వాత 2024 మొదటి త్రైమాసికంలో 9.33 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్‌లను పొందింది. గ్లోబల్ యూజర్ బేస్‌లో ఇదే గణనీయమైన పెరుగుదలగా చెప్పవచ్చు. స్ట్రీమింగ్ దిగ్గజం పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధం నేపథ్యంలో కొత్త సబ్‌స్క్రైబర్‌లు భారీ సంఖ్యలో పెరిగారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ అంచనాలను మించిపోయింది. విశ్లేషకుల అంచనాలను కూడా దాదాపు రెట్టింపు చేసింది.

Read Also : Netflix : వామ్మో.. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలుసా?

మార్చి నాటికి 269.6 మిలియన్లు :
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఇప్పుడు మార్చి నెలాఖరు నాటికి 269.6 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచం నలుమూలల నుంచి కొత్త కస్టమర్లతో నెట్‌ఫ్లిక్స్ పుంజుకుంది. సగటున ప్రతి ఇంటికి ఇద్దరు కన్నా ఎక్కువ మంది యూజర్లతో అర బిలియన్ల మంది వ్యూయర్స్ ఉన్నారని కంపెనీ పెట్టుబడిదారులకు రాసిన లేఖలో పేర్కొంది. ఇంతకు ముందు ఏ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ఈ స్థాయిలో రాణించలేదని తెలిపింది. అనధికారిక అకౌంట్ల వినియోగాన్ని పరిష్కరించడంలో నెట్‌ఫ్లిక్స్ దృఢమైన వైఖరి ఈ అద్భుతమైన విజయానికి కారణమని నివేదిక తెలిపింది.

దాదాపు 100 మిలియన్ల మంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌కు నేరుగా సబ్‌స్క్రైబ్ చేయకుండా వేరొకరి అకౌంట్లను ఉచితంగా ఉపయోగిస్తున్నారు. దాంతో నెట్‌‌ఫ్లిక్స్ ఆదాయపరంగా, చెల్లింపు చందాదారులను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేరింగ్ విధానంపై పరిమితులు విధించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సైతం సబ్‌స్క్రైబర్ కాకుండా కంపెనీ ఆదాయం, ఆపరేటింగ్ మార్జిన్‌లపై దృష్టి పెట్టాలని పెట్టుబడిదారులను కోరినట్లు రాయిటర్స్ నివేదించింది.

Read Also : Apple iPhone 15 Pro : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై రూ.16,700 డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ట్రెండింగ్ వార్తలు