Netflix : వామ్మో.. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలుసా?

తాజాగా నెట్‌ఫ్లిక్స్ తమ సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో ప్రకటించింది.

Netflix : వామ్మో.. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలుసా?

Netflix OTT World wide Subscribers till 2023 end Full Details Here

Netflix : ఒకప్పుడు ఓటీటీ(OTT) అంటే కొంతమందికే తెలుసు. కానీ కరోనా వచ్చిన తర్వాత ప్రపంచ సినిమాని మన అరచేతుల్లోకి ఓటీటీలు తీసుకొచ్చేశాయి. కరోనాతో ఎంతమంది నష్టపోయినా లాభపడిన వాళ్ళల్లో ముందు ఉండేది ఓటీటీ కంపెనీలే. కరోనా సమయంలో అన్ని ఓటీటీలు కొత్త సబ్’స్క్రైబర్స్ ని పెంచుకున్నారు. కొత్త కొత్త కంటెంట్ ని తీసుకొచ్చారు. కొత్త ఓటీటీలు కూడా పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం వరల్డ్ టాప్ ఓటీటీగా నెట్‌ఫ్లిక్స్ కొనసాగుతుంది.

దాదాపు అన్ని దేశాల్లోనూ తన సేవలు ఉండటం, సొంత కంటెంట్ ఎక్కువగా ఇవ్వడం, లోకల్ గా అన్ని భాషల్లోనూ కంటెంట్ క్రియేట్ చేయడం, అడల్ట్ కంటెంట్ ఉండటం.. ఇలాంటి అంశాలతో సబ్‌స్క్రిప్షన్ ఫీజ్ ఎక్కువగా ఉన్నా నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా టాప్ లో కొనసాగుతుంది. నెట్‌ఫ్లిక్స్ తర్వాతే మిగిలిన ఓటీటీలు ఉన్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ తమ సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో ప్రకటించింది.

గతంలో 2023లో నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ దాదాపు 240 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు ప్రకటించింది. తాజాగా 2023 చివరివరకు నెట్‌ఫ్లిక్స్ కి ప్రపంచవ్యాప్తంగా 260 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు ప్రకటించింది. అంటే దాదాపు 26 కోట్లకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు నెట్‌ఫ్లిక్స్ కి. గత మూడు నెలల్లోనే 13 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ పెరిగారని తెలిపింది. వేరే ఓటీటీలతో పోలిస్తే ఎక్కువ ఫీజ్ ఉన్నా నెట్‌ఫ్లిక్స్ కి సబ్ స్క్రైబర్స్ పెరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే కేవలం కంటెంట్ ఎక్కువగా ఇవ్వడం, మంచి వరల్డ్ కంటెంట్ అందిస్తుండటంతోనే ప్రేక్షకులు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఫుల్ ప్రాఫిట్స్ లో కూడా నడుస్తుందని సమాచారం.

Also Read : Trivikram : ‘గుంటూరు కారం’ అయిపోయింది.. త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి? ఆ ముగ్గురి హీరోల్లో ఎవరితో సినిమా?

ఇటీవల మన ఇండియాలో కూడా నెట్‌ఫ్లిక్స్ తన బిజినెస్ ని పెంచుకుంది. లోకల్ భాషల్లో కూడా ఒరిజినల్ కంటెంట్ ని అందిస్తూ ప్రేక్షకులని తమ వైపుకు తిప్పుకుంటుంది. అంతేకాక ఇక్కడి స్టార్ హీరోల సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్ కొనేస్తూ అభిమానులని తమ అడ్డకు రప్పించుకుంటుంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సారండోస్ ఇండియాకు వచ్చి బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ని కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే.