Netflix Subscription : వావ్.. నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. 30 రోజులు ఫ్రీగా చూడొచ్చు.. ఒక్క పైసా కట్టక్కర్లేదు.. ఎలా పొందాలంటే?
Netflix Subscription : దాదాపు 6 ఏళ్ల తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ట్రయల్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను మీరు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా? కంపెనీ హెల్ప్ పేజీలో వివరాలపై ఓసారి లుక్కేయండి..
Netflix Subscription
- భారత మార్కెట్లోకి నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ట్రయల్ రీఎంట్రీ
- 30 రోజుల ఫ్రీ నెట్‌ఫ్లిక్స్.. 6 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఆఫర్
- ఈ ఆఫర్ ఎవరికి? ఎలా క్లెయిమ్ చేయాలి?
Netflix Subscription : నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు ఎగిరిగంతేసే వార్త.. నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ మళ్లీ వస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ ఉచిత ట్రయల్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు కొత్త అకౌంట్ కోసం సైన్ అప్ చేసినప్పుడు స్ట్రీమింగ్ సర్వీసు ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ట్రయల్స్‌ను 2020లోనే నిలిపివేయగా, దాదాపు ఆరేళ్ల తర్వాత కంపెనీ (Netflix Subscription) అందిస్తోంది. ఈ ఫ్రీ ట్రయల్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకసారి సైన్ అప్ అయ్యాక 30 రోజుల పాటు సినిమాలు, టీవీ షోలను ఫ్రీగా చూడొచ్చు.
నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ ట్రయల్ ఎలా పొందాలి? :
ఎంపిక చేసిన దేశాల్లోని అర్హత గల కొత్త సభ్యులకు స్ట్రీమింగ్ సర్వీసు ఫ్రీ ట్రయల్‌ను అందిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ధృవీకరించింది. కంపెనీ హెల్ప్ సెంటర్ ప్రకారం.. ఒక వినియోగదారుడి అకౌంట్, డివైజ్, లొకేషన్, అర్హత ఉంటే సైన్-అప్ సమయంలో ఫ్రీ ట్రయల్ ఆప్షన్ ఆటోమాటిక్‌గా కనిపిస్తుంది.
Read Also : Diamond Lotus : అంతరిక్షంలో వికసించనున్న వజ్ర కమలం.. విక్రమ్-1తో భారత్ కొత్త చరిత్ర!
ఒకవేళ ఈ ఆఫర్ వారికి కనిపించకపోతే వారి ఖాతా ఇంకా అర్హత పొందలేదని అర్థం. భారత మార్కెట్లోకి ఫ్రీ ట్రయల్ రీఎంట్రీ ఇవ్వడంపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కొత్త ఇమెయిల్ ద్వారా కొత్త నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ క్రియేట్ చేస్తే జీరో ఛార్జ్‌తో 30 రోజుల ట్రయల్ ఆఫర్ అందుబాటులో ఉందని నివేదిక తెలిపింది.
కొందరికి 30 రోజులు, మరికొందరికి 15 రోజుల ఆఫర్ :
నివేదికల ప్రకారం.. ట్రయల్ వ్యవధి అనేది అన్ని ఖాతాలకు ఒకేలా ఉండకపోవచ్చు. కొంతమందికి 30 రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఉంటే.. మరికొందరు 15 రోజుల ట్రయల్ ఆఫర్‌ను అందుకున్నట్లు నివేదించారు. అంటే.. కంపెనీ A/B టెస్టింగ్‌ను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో వేర్వేరు కస్టమర్లకు వేర్వేరు ప్రమోషనల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
2020లో నిలిచిపోయిన ట్రయల్ ఆఫర్ :
నెట్‌ఫ్లిక్స్ చాలా ఏళ్లుగా 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ను అందించింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రయల్ ఆఫర్ నిలిపివేసింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఫ్రీ ట్రయల్ ప్రవేశపెట్టటం ద్వారా స్ట్రీమింగ్ సర్వీసుకు ఎక్కువమంది సబ్స్క్రయిబ్ చేసుకుంటారని భావిస్తోంది.
