Netflix’s new Profile Transfer feature eases password sharing restrictions
Netflix Profile Transfer feature : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌లో కొత్త మార్పు చేసింది. ఈ ఫీచర్ నెట్‌ఫ్లిక్స్ సభ్యులు తమ ప్రొఫైల్ సెట్టింగ్‌లు, ప్రాధాన్యతలను ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు అనుమతిస్తుంది. గతంలో మీ ప్రొఫైల్‌ను వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే.. మీరు పూర్తిగా కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి. కానీ ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. తద్వారా మీ ప్రొఫైల్‌ను కొత్తదాన్ని క్రియేట్ చేసే బదులు ఇప్పటికే ఉన్న అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ కంపెనీ ప్రారంభించిన పాస్‌వర్డ్ షేరింగ్ రిస్ట్రక్షన్‌పై పరిమితులను తగ్గించింది. ఈ ఫీచర్‌తో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేరింగ్ పరిమితులను సులభతరం చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ యూజర్లు తమ ప్రొఫైల్ డేటాను ఇప్పటికే ఉన్న అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు అనుమతిస్తోంది. తద్వారా అకౌంట్లను షేరింగ్ చేస్తున్న యూజర్లు వారి కస్టమైజ్ చేసిన కంటెంట్, సెట్టింగ్‌లకు యాక్సస్ తిరిగి పొందేందుకు (Netflix) మార్గాన్ని అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ అప్‌డేట్‌ను బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. టెక్ క్రంచ్ ప్రకారం.. యూజర్లు ఎక్కువగా అభ్యర్థించిన ఫీచర్ అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ సభ్యులందరికీ కంపెనీ ఈ అప్‌డేట్‌ను అందిస్తోంది. మీరు మల్టీ అకౌంట్లను కలిగి ఉంటే లేదా మరొకరి అకౌంట్‌కు మారాలనుకుంటే.. ఇప్పుడు కొత్త అకౌంట్ ప్రారంభించాల్సిన అవసరం లేకుండా మీ ప్రొఫైల్ ప్రాధాన్యతలను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
Netflix Profile Transfer Netflix’s new Profile Transfer feature eases password sharing restrictions
నెట్‌ఫ్లిక్స్ మీ ప్రొఫైల్ వివరాలను ఒక నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ నుంచి మరో అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని సులభతరం చేసింది. మీ స్నేహితుని అకౌంట్ షేర్ చేస్తున్నారని అనుకుందాం. కానీ, నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై కొన్ని పరిమితులను విధించింది. దాంతో యూజర్లు పాస్‌వర్డ్ షేరింగ్ యాక్సస్ కోల్పోయారు. గతంలో ఉపయోగించిన పాత నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కలిగి ఉన్నట్లయితే.. మీ వ్యూ హిస్టరీ, సేవ్ చేసిన డిస్‌ప్లేలు, ప్రాధాన్యతల వంటి మీ ప్రొఫైల్ వివరాలను ఆ పాత అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అయితే, నెట్‌ఫ్లిక్స్ పాత అకౌంట్ లేకుంటే ఏమి చేయాలి? మీకు కావాలంటే మీ ప్రొఫైల్‌ను వేరొకరి అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మీ కుటుంబ సభ్యుల అకౌంట్ లేదా ఇతర కుటుంబ సభ్యుల అకౌంట్ మారాలనుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్‌తో మీరు మీ ప్రొఫైల్ సమాచారాన్ని వారి అకౌంట్ సులభంగా తరలించవచ్చు. అదేలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో హోంపేజీలో ఉన్నప్పుడు.. డ్రాప్‌డౌన్ మెనులో మీ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. ‘Transfer Profile’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి.. ఆపై స్క్రీన్‌పై కనిపించే సూచనలను ఫాలో అవ్వండి. మీ ప్రొఫైల్‌ను ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు.. మీ పర్సనలైజడ్ సిఫార్సులు, వాచ్ లిస్టు, సేవ్ చేసిన గేమ్‌లు, కస్టమైజ్ చేసిన ఏవైనా ఇతర సెట్టింగ్‌లు అన్నీ కొత్త అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.