New IRCTC Account : కొత్త IRCTC అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్లు ఎలా బుకింగ్ చేయాలో తెలుసా?

New IRCTC Account : IRCTC రైలు టిక్కెట్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్‌ను అందిస్తోంది. రైల్వే ప్రయాణీకులు (IRCTC) వెబ్‌సైట్ లేదా (IRCTC App ) యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

New IRCTC Account : కొత్త IRCTC అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్లు ఎలా బుకింగ్ చేయాలో తెలుసా?

New IRCTC Account _ How to create a new IRCTC account and book train tickets online

Updated On : March 22, 2023 / 7:55 PM IST

New IRCTC Account : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైలు టిక్కెట్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్‌ను అందిస్తోంది. రైల్వే ప్రయాణీకులు (IRCTC) వెబ్‌సైట్ లేదా (IRCTC App ) యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే టికెట్ల ఆప్షన్‌కు సంబంధించిన ఏదైనా ఆన్‌లైన్ పేమెంట్ మెథడ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అనుమతిస్తుంది. Paytm, Make Mytrip మొదలైన ట్రావెల్ బుకింగ్ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ప్రయాణికులు రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

అయితే, ఈ వెబ్‌సైట్‌ల నుంచి లేదా (IRCTC) ఆన్‌లైన్ వెబ్ పేజీ లేదా యాప్ నుంచి రైలు టిక్కెట్‌లను బుక్ చేసేందుకు మీరు ముందుగా IRCTC అకౌంట్ క్రియేట్ చేయాలి. మీరు కూడా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంటే.. IRCTC అకౌంట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. మీకు IRCTC అకౌంట్ లేకుండా ఎలా క్రియేట్ చేయాలి? ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ఎలా అనేదానిపై పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

IRCTC అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే? :

* IRCTC వెబ్‌సైట్ (www.irctc.co.in)ని విజిట్ చేయండి.
* పేజీ కుడి ఎగువ మూలలో ఉన్న ‘Register’ బటన్‌పై Click చేయండి.
* యూజర్ టైప్ ‘Individual’ ఎంచుకోండి.
* మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, ఇమెయిల్ ID, మొబైల్ నంబర్, అడ్రస్ వంటి అవసరమైన వివరాలను నింపండి.
* మీ IRCTC అకౌంట్ కోసం యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.
* యూజర్ నేమ్ ప్రత్యేకంగా 3 నుంచి 35 అక్షరాల మధ్య ఉండాలి.

Read Also : IRCTC అకౌంట్ పాస్‌వర్డ్ మరిచిపోయారా? ఇలా రీసెట్ చేసుకోండి!

* (security question)ను ఎంచుకోండి.
* మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాల్సిన అవసరం ఉంటే.. సులభంగా గుర్తుండే సమాధానాన్ని ఎంచుకోండి.
* Captcha కోడ్‌ని ఎంటర్ చేయడం ద్వారా Process ధృవీకరించండి.
* (Submit)పై Click చేయండి.
* మీ లాగిన్ పాస్‌వర్డ్‌గా వ్యాలిడిటీ అయ్యే ఇమెయిల్ ID, మొబైల్ నంబర్‌ను ఇవ్వండి.
* మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ IDలో OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) పొందుతారు.
* అవసరమైన ఫీల్డ్‌లో OTPని ఎంటర్ చేసి, ‘Submit’ బటన్‌పై Click చేయండి.

New IRCTC Account _ How to create a new IRCTC account and book train tickets online

New IRCTC Account _ How to create a new IRCTC account

ముఖ్యంగా, మీ IRCTC అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సరైన కచ్చితమైన వివరాలను యాడ్ చేయాలని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఈ సమాచారం భవిష్యత్ బుకింగ్‌లన్నింటికీ ఉపయోగపడుతుంది. అదనంగా, మీ అకౌంట్ అనధికార యాక్సస్నిరోధించడానికి సాయపడుతుంది. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచుకోవాలి.

IRCTC నుంచి ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే? :
ఐఆర్‌సీటీసీలో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, మీకోసం ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌ను ఎలా బుక్ చేసుకోవచ్చు.

* మీ IRCTC అకౌంట్ లాగిన్ చేయండి.
* ప్రయాణ తేదీతో పాటు బయలుదేరే, గమ్యస్థాన స్టేషన్‌లను ఎంచుకోండి.
* ఆ తర్వాత 1వ AC, 2వ AC, 3వ AC, స్లీపర్ మొదలైన ట్రావెల్ క్లాసులను ఎంచుకోండి.
* ఇప్పుడు అందుబాటులో ఉన్న రైళ్లు, సమయాలను చెక్ చేయడానికి ‘Find Trains’పై క్లిక్ చేయండి.
* మీరు ప్రయాణించాలనుకుంటున్న రైలును ఎంచుకుని, ‘Check Availability & Fare’పై క్లిక్ చేయండి.
* కోటాను (జనరల్, తత్కాల్, లేడీస్ మొదలైనవి) ఎంచుకుని, ‘Book Now’పై క్లిక్ చేయండి.
* ప్రయాణీకుల వివరాలను (పేరు, వయస్సు, లింగం, బెర్త్ ప్రాధాన్యత వంటివి) రిజిస్టర్ చేసి ‘Continue Booking’పై క్లిక్ చేయండి.
* మీ బుకింగ్ వివరాలను సమీక్షించి, ‘Make Payment’పై క్లిక్ చేయండి.
* పేమెంట్ పద్ధతిని (క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఇ-వాలెట్ వంటివి) ఎంచుకోండి. పేమెంట్ వివరాలను ఎంటర్ చేయండి.
* మీ బుకింగ్‌ను పూర్తి చేసేందుకు ‘Payment’పై Click చేయండి.
* పేమెంట్ పూర్తయిన తర్వాత, మీ టిక్కెట్ వివరాలతో confirmation మెసేజ్, ఇమెయిల్‌ను అందుకుంటారు.

Read Also : IRCTC Food Online : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు!