Royal Enfield Meteor 350 : బుల్లెట్ బైక్ కావాలా? కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 వేరియంట్ వారీగా ధరలివే.. ఫుల్ లిస్ట్ ఇదిగో..!
Royal Enfield Meteor 350 : రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 మోడల్స్ భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.. వేరియంట్ల వారీగా ఎంతంటే?

Royal Enfield Meteor 350
Royal Enfield Meteor 350 Price List 2025 : రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 రోజువారీ రైడర్లు, హైవే-ఫ్రెండ్లీ క్రూయిజర్‌గా అందిస్తోంది. క్లాసిక్ సిల్హౌట్‌ను అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది. అద్భుతమైన స్టైలింగ్, బడ్జెట్ ఆధారంగా మల్టీ వేరియంట్‌లలో లభిస్తోంది. 2025 నాటికి మెటియోర్ 350 మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది.
అందులో ఫైర్‌బాల్, స్టెల్లార్, అరోరా, సూపర్నోవా ఉన్నాయి. పెయింట్ (Royal Enfield Meteor 350) ఆప్షన్లు, కాస్మెటిక్ వివరాలలో తేడాలతో అన్నీ ఒకే ఇంజిన్, మెకానికల్ సెటప్‌ను కలిగి ఉంటాయి. కొనుగోలుదారులు తమకు నచ్చిన బైక్ ఏది ఎంచుకోవాలి? ధర పరంగా వేరియంట్‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 వేరియంట్లు :
ఫైర్‌బాల్ వేరియంట్ మీటియోర్ 350 రేంజ్‌కు ఎంట్రీ పాయింట్. అవసరమైన ప్యాకేజీతో పాటు బ్రైట్‌నెస్ కలర్ ఆప్షన్లను అందిస్తుంది. స్టెల్లార్ మరింత అడ్వాన్స్ ఎండ్, పాపులర్ పెయింట్ స్కీమ్‌లను చేర్చుతుంది. అరోరా వేరియంట్ రెట్రో-ప్రేరేపిత కలర్లు, ట్రిమ్ ఎలిమెంట్‌లతో మరింత క్లాసిక్ లుక్‌లోకి తిరగి వస్తుంది. పైభాగంలో సూపర్ నోవా కలగి ఉంది. రిచ్ కలర్స్, మరింత ప్రీమియం విజువల్ అందిస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 : 2025 ధరల జాబితా :
రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరల ఈ కింది విధంగా ఉన్నాయి.
- సూపర్నోవా బ్లాక్: రూ. 2.16 లక్షలు
- సూపర్నోవా రెడ్ : రూ. 2.14 లక్షలు
- సూపర్నోవా బ్లూ : రూ. 2.14 లక్షలు
- అరోరా రెట్రో గ్రీన్ : రూ. 2.06 లక్షలు
- అరోరా రెడ్ : రూ. 2.06 లక్షలు
- అరోరా బ్లూ : రూ. 2.04 లక్షలు
- అరోరా బ్లాక్ : రూ. 2.04 లక్షలు
- స్టెల్లార్ మెరైన్ బ్లూ : రూ. 2.03 లక్షలు
- స్టెల్లార్ మ్యాట్ గ్రే : రూ. 2.03 లక్షలు
- స్టెల్లార్ బ్లూ : రూ. 2.01 లక్షలు
- స్టెల్లార్ బ్లాక్ : రూ. 2.01 లక్షలు
- ఫైర్‌బాల్ ఆరెంజ్ : రూ. 1.96 లక్షలు
- ఫైర్‌బాల్ గ్రే : రూ. 1.96 లక్షలు
- ఫైర్‌బాల్ బ్లాక్ : రూ. 1.91 లక్షలు
- ఫైర్‌బాల్ మ్యాట్ గ్రీన్ : రూ. 1.91 లక్షలు
- ఫైర్‌బాల్ రెడ్ : రూ. 1.91 లక్షలు
లోకల్ టాక్స్ డీలర్ ఛార్జీలను బట్టి ధరలు నగరాల మధ్య కొద్దిగా మారవచ్చు. ఈ గణాంకాలు లైనప్‌లో ప్రతి వేరియంట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
ట్రిమ్‌లలో కనిపించే ఫీచర్లు :
అన్ని మెటియోర్ 350 వేరియంట్‌లు సింగిల్ టైప్ ఛాసిస్, ఇంజిన్, రైడింగ్ ఎర్గోనామిక్స్, ఎక్విప్‌మెంట్ బేస్ కలిగి ఉన్నాయి. యాక్సెసరీస్ కేటలాగ్ అన్ని ట్రిమ్‌లకు సపోర్ట చేస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు బైకును నచ్చినవిధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వేరియంట్ ఆప్షన్ హార్డ్‌వేర్ మధ్య తేడా కన్నా స్టైలింగ్, ధరపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.