New WhatsApp Update will let users use app on multiple iPhones simultaneously
New WhatsApp Update to use app on multiple iPhones : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. వాట్సాప్ యాప్‌లో ‘కంపానియన్ మోడ్’ అనే కొత్త ఫీచర్ అప్‌డేట్‌ను స్వీకరిస్తోంది. ఐఫోన్ iOS యూజర్ల కోసం కొత్త వెర్షన్ (23.10.76) భారత మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది. వాట్సాప్ యూజర్లు (Apple App Store) నుంచి యాప్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు. కంపానియన్ మోడ్ యూజర్లు వాట్సాప్‌ను ఒకేసారి 4 ఐఫోన్‌లలో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకీ వాట్సాప్ ఫీచర్ బెనిఫిట్స్ ఏమిటంటే.. వాట్సాప్ ఒకే సమయంలో మల్టీ ఐఫోన్‌లలో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉపయోగించవచ్చు.
వాట్సాప్ కంపానియన్ మోడ్ ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. మీ సెకండరీ డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి టాప్ రైట్ సైడ్‌లో ఉన్న త్రి డాట్స్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ‘Link Device ’ ఎంచుకోండి. మీకు QR కోడ్ కనిపిస్తుంది. ప్రైమరీ డివైజ్‌లో సెట్టింగ్‌లకు వెళ్లి, లింక్డ్ డివైజ్‌లను ఎంచుకోండి. సెకండరీ డివైజ్‌లో QR కోడ్‌ను స్కాన్ చేసేందుకు మీరు మీ కెమెరాకు యాక్సెస్ ఇవ్వాలి. వాట్సాప్ రెండు డివైజ్‌ల మధ్య కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా, ప్రైమరీ ఐఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా సెకండరీ డివైజ్ పనిచేస్తుంది.
వాట్సాప్ యూజర్లు సెకండరీ ఐఫోన్‌లతో వాట్సాప్ వీడియో/ఆడియో కాల్‌లు చేయవచ్చు. ఇతర ఫీచర్‌లను పొందవచ్చు. కొన్ని చాట్‌లు పూర్తిగా లోడ్ కాకపోవచ్చు. పాత కాల్ లాగ్‌లు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. వాట్సాప్ పేరంట్ కంపెనీ మెటా యూజర్ల ప్రైవసీని ప్రొటెక్ట్ చేసేందుకు అదే ఎండ్-టు-ఎండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను అందిస్తుంది.
New WhatsApp Update will let users use app on multiple iPhones simultaneously
కంపానియన్ మోడ్‌తో పాటు వాట్సాప్ కొత్త ఫీచర్లను కూడా అందిస్తుంది. వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ‘అదృశ్యమయ్యే మెసేజ్‌లను’ సేవ్ చేసుకోవచ్చునని నివేదిక పేర్కొంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించాలంటే.. ఎక్కువసేపు ట్యాప్ చేసిన తర్వాత టెక్స్ట్ సేవ్ చేయడానికి ‘Keep’ ఆప్షన్ ఎంచుకోండి.
అంతేకాకుండా, యాప్ అప్‌డేట్ చేసిన ఫాంట్‌లు బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌తో సహా స్టేటస్ కోసం కొత్త టెక్స్ట్ ఓవర్‌లే టూల్స్ యాడ్ చేస్తోంది. GIFలతో ట్యాప్ చేయకుండా ఆటోమాటిక్‌గా ప్లే అవుతాయని నివేదిక తెలిపింది. వాట్సాప్ యూజర్లు కాల్స్ ట్యాబ్ నుంచి కాల్ లింక్‌ను క్రియేట్ చేసినప్పుడు ‘Add Calender’ని ఎంచుకోవడం ద్వారా iOS క్యాలెండర్ యాప్‌కి వాట్సాప్ కాల్ లింక్‌ను కూడా యాడ్ చేయొచ్చు. ఇంతలో, వాట్సాప్ త్వరలో విడుదలయ్యే కొత్త ఫీచర్‌ను కూడా టెస్టింగ్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్లు స్క్రీన్ షేరింగ్, లాంగ్వేజీలో మార్పు, యూజర్ నేమ్ ఆప్షన్ వంటి మరిన్ని ఆప్షన్లు ఉన్నాయి.