Nokia G21 smartphone: భారత్ లో జీ21 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన నోకియా, మరో రెండు చిన్న ఫోన్లు కూడా

నోకియా జీ21 స్మార్ట్ ఫోన్ బుధవారం భారత మార్కెట్లోకి విడుదల అయింది. 3 రోజులు పాటు బ్యాటరీ, రెండేళ్ల పాటు వరుస సాఫ్ట్‌వేర్ అప్డేట్ సహా మరెన్నో ఫీచర్స్ ఈ G21లో ఉన్నాయి

Nokia G21 smartphone: నోకియా సంస్థ భారత్ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న G సిరీస్ లో ఈ సరికొత్త ఫోన్ విడుదల చేసింది నోకియా. నోకియా జీ21 స్మార్ట్ ఫోన్ బుధవారం భారత మార్కెట్లోకి విడుదల అయింది. 3 రోజులు పాటు బ్యాటరీ, రెండేళ్ల పాటు వరుస సాఫ్ట్‌వేర్ అప్డేట్ సహా మరెన్నో ఫీచర్స్ ఈ G21లో ఉన్నాయి. అదేసమయంలో గత G20 మోడల్ కే కాస్త మెరుగులు దిద్ది G21గా మార్కెట్లోకి తెచ్చింది అంటూ క్రిటిక్స్ సైతం పెదవి విరుస్తున్నారు. అయితే మిగతా బ్రాండ్ ఫోన్స్ తో పోల్చుకుంటే నోకియా ఫోన్స్ లైఫ్ కాస్త ఎక్కువగానే ఉంటుందని కూడా క్రిటిక్స్ చెప్పుకొస్తున్నారు. మరి G21 ఫోన్స్ ప్రత్యేకతలు ఏంటంటే..

Also read:world Most Expensive Mangoes : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు..కిలో 2.70 లక్షలు..

90Hz రెఫ్రెషింగ్ రేట్ కలిగిన 6.5 అంగుళాల ఎల్సిడి స్క్రీన్, HD+ రెసొల్యూషన్ తో వస్తుంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా, వెనుక 50MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో 5050mAh బ్యాటరీ కలిగి ఉంది. అయితే ఇండియాలో మాత్రం 10W ఛార్జింగ్ అడాప్టర్ మాత్రమే ఇస్తున్నారు. 4GB + 64GB, 6GB + 128GB వేరియంట్లలో లభిస్తున్న ఈ G21 స్మార్ట్ ఫోన్ ధర వరుసగా రూ.12,999 మరియు రూ.14,999గా నిర్ణయించింది నోకియా సంస్థ. ప్రారంభ ఆఫర్ కింద ఈ G21 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి..Nokia BH-405 TWS బ్లూటూత్ ను ఫ్రీగా ఇస్తున్నారు.

Also read:Electric bike: కొత్త స్కూటీ మార్గం మధ్యలో ఆగిందని పెట్రోల్ పోసి తగలబెట్టిండు

ఇక G21తో పాటుగా మరో రెండు ఫీచర్ ఫోన్లను కూడా నోకియా భారత్ లో విడుదల చేసింది. నోకియా 105, 105 ప్లస్ అనే రెండు ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. రెండు రంగులలో లభించే నోకియా 105 ధర రూ.1,299 నుండి ప్రారంభం అవుతుండగా, నోకియా 105 ప్లస్ రూ.1,399కు లభిస్తుంది. వీటితో పాటుగా నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్ రూ. 2,799 మరియు నోకియా గో ఇయర్‌బడ్స్+ రూ. 1,999ను కూడా సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

Also read:Xiaomi 12 Pro : ఇండియాలో ఫస్ట్ టైం.. 3 కెమెరాలతో షావోమీ 12ప్రో ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు