Electric bike: కొత్త స్కూటీ మార్గం మధ్యలో ఆగిందని పెట్రోల్ పోసి తగలబెట్టిండు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పెట్రోల్ లీటరు ధర రూ. 120కి చేరింది. దీంతో ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లాలంటే ప్రజలు ఓసారి ఆలోచిస్తున్నారు. పట్టణాల్లో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తూ పనులు పూర్తిచేసుకొని...

Electric bike: కొత్త స్కూటీ మార్గం మధ్యలో ఆగిందని పెట్రోల్ పోసి తగలబెట్టిండు

Electric Bike

Electric bike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పెట్రోల్ లీటరు ధర రూ. 120కి చేరింది. దీంతో ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లాలంటే ప్రజలు ఓసారి ఆలోచిస్తున్నారు. పట్టణాల్లో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తూ పనులు పూర్తిచేసుకొని వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న క్రమంలో అధికశాతం మంది ఎలక్ట్రిక్ బైక్ వైపు వెళ్తున్నారు. దీంతో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్ లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ బైక్ లు పేలిపోతున్నట్లు వార్తలు వస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ తమ 1,441 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేసింది.

Electric Bike Battery : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి

ఈ క్రమంలోనే తమిళనాడులో తాజాగా ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు నివాసి మార్గం మధ్యలో తన ఎలక్ట్రికల్ స్కూటీ ఆగిపోయిందని ఏకంగా స్కూటీని పెట్రోల్ పోసి తగలబెట్టేసిండు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుపత్తూరు ప్రాంతానికి చెందిన పృథ్వీరాజ్ ఇటీవల ఓ ఎలక్ట్రికల్ స్కూటీని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ కోసం సమీపంలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. మీరు ఉంటున్న ప్రాంతం ఈ కార్యాలయం పరిధిలోకి రాదని, గుడియాట్టమ్ లోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాలని అక్కడి అధికారులు సూచించారు. దీంతో 50 కిలో మీటర్లు దూరంలో ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో స్కూటీ ఆగిపోయింది.

Electric Bike Explodes : బాంబులా పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తండ్రి, కూతురు మృతి

ఎంతకీ స్టార్ట్ కాలేదు. దీంతో విషయాన్ని ఫోన్ ద్వారా కంపెనీ సిబ్బందికి తెలియజేశాడు. మూడు గంటలైనా వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో వీడియో సందేశాన్ని కూడా పంపాడు. అయినా స్పందించక పోవటంతో ఆగ్రహంతో ఎలక్ట్రికల్ స్కూటీని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనను పక్కనే ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలంటే బెంబేలెత్తిపోతున్న వాహనదారులు తాజా ఘటనతో ఆ వాహనాల జోలికి వెళ్లేందుకు సాహసించడం లేదు.