యాహూ.. నథింగ్‌ నుంచి తక్కువ ధరకు మరో స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌ డేట్‌ ఫిక్స్‌.. 

నథింగ్ కంపెనీ ప్రో మోడల్‌ను మాత్రమే లాంచ్‌ చేస్తుండడంతో దాని ధర స్టాండర్డ్‌ సీఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

భారత్‌లో నథింగ్‌ నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో లాంచ్ కానుంది. ఇప్పటికే ఆ కంపెనీ నుంచి కొత్త నథింగ్‌ ఫోన్ 3ఏ సిరీస్‌ను రూ.30,000 లోపు ధరతో లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. నథింగ్ నుంచి రూ.20,000 కంటే తక్కువ ధర ఉండే స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్న వారి కోసం సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోను తీసుకొస్తోంది.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోను ఏప్రిల్ 28న సాయంత్రం 6.30 గంటలకు లాంచ్ చేస్తామని ఆ కంపెనీ ప్రకటన చేసింది. సీఎంఎఫ్ ఫోన్ 1కు తదుపరి వెర్షెన్‌గా ఇది విడుదల కానుంది. నథింగ్ బ్రాండ్ నుంచి స్టాండర్డ్‌ సీఎంఎఫ్ ఫోన్ 2 మోడల్‌ కూడా వస్తుందా? లేదా ప్రో వెర్షన్‌ను మాత్రమే విడుదల కానుందా? అన్న విషయం గురించి స్పష్టత లేదు.

Also Read: వోక్స్‌వ్యాగన్ ఈ కారును లాంచ్‌ చేస్తున్నది మామూలు ఫీచర్లతో కాదు.. కెవ్వుకేక..

ఇప్పటివరకు నథింగ్ ప్రో వెర్షన్‌ గురించి మాత్రమే వివరాలు తెలిపింది. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోను మాత్రమే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

నథింగ్ కంపెనీ ప్రో మోడల్‌ను మాత్రమే లాంచ్‌ చేస్తుండడంతో దాని ధర స్టాండర్డ్‌ సీఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర సుమారు 20,000 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్‌ ధర రూ.22,999 నుంచి ప్రారంభమవుతోంది.

దీంతో, సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర రూ.20,000 సెగ్మెంట్‌కు మించి ఉండకపోవచ్చు. ఇప్పటికే సీఎంఎఫ్ ఫోన్ 1 రూ.15,999 ధరకు అందుబాటులో ఉంది.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోను విడుదల చేయనున్న ఏప్రిల్ 28 రోజునే సీఎంఎఫ్ మూడు కొత్త ఆడియో ప్రొడక్ట్‌లను కూడా లాంచ్ చేయనుంది. సీఎంఎఫ్ బడ్స్‌ 2, బడ్స్‌ 2ఏ, బడ్స్‌ 2 ప్లస్ పేరుతో ఇవి విడుదల అవుతాయి.