వోక్స్‌వ్యాగన్ ఈ కారును లాంచ్ చేస్తున్నది మామూలు ఫీచర్లతో కాదు.. కెవ్వుకేక..
ఈ టెక్నాలజీల వల్ల కారు భద్రత, పనితీరు, సౌకర్యం, సౌలభ్యం, కనెక్టివిటీ, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ వంటివి చాలా మెరుగుపడతాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ కారును భారత్‌లో ఏప్రిల్ 14న లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాని ఫీచర్లకు సంబంధించిన మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ప్రీమియం ఎస్‌యూవీ. ఈ కారును మరింత హయ్యర్ స్టాండర్డ్‌తో తీసుకురావడానికి కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజీని వాడుతున్నట్లు ఆ సంస్థ తాజాగా ఓ ప్రెస్‌నోట్‌లో చెప్పింది.
కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజీ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్, ఇన్నోవేటివ్ ఫీచర్లు, సిస్టమ్స్. వీటిని వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ కారులో తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీల వల్ల కారు భద్రత, పనితీరు, సౌకర్యం, సౌలభ్యం, కనెక్టివిటీ, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ వంటివి చాలా మెరుగుపడతాయి.
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ కారును స్పోర్టీ లుక్స్, మోడర్న్ ఫంక్షనాలిటీ, డిజిటల్ ఫస్ట్ డ్రైవింగ్‌తో విడుదల చేయనుంది. డిజిటల్ ఫస్ట్ డ్రైవింగ్ అంటే కారు కంట్రోళ్లు, డిస్ప్లేలు ఎక్కువగా స్క్రీన్‌లు, సాఫ్ట్‌వేర్‌ల రూపంలో ఉంటాయి. బటన్లు, డయల్‌ల రూపంలో కాదు.
ఇందులో 26.04 సెం.మీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది ఆధునిక కార్ డాష్‌బోర్డ్ డిస్‌ప్లే. ఇది సాంప్రదాయ అనలాగ్ డయల్‌లకు బదులుగా డిజిటల్ స్క్రీన్‌ను ఉపయోగిస్తుంది. ఈ డిజిటల్ స్క్రీన్‌ను డ్రైవర్‌కు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, డ్రైవర్లు నావిగేషన్ మ్యాప్స్, వెహికిల్ వేగం, ఇంధన స్థాయిలు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సబంధించిన వివరాలను చూడటానికి దీన్ని వాడుకోవచ్చు.
వోక్స్‌వ్యాగన్ ఫోర్త్ జనరేషన్ మాడ్యులర్ ఇన్ఫోటైన్మెంట్ టూల్‌కిట్ (MIB4)లో నిర్మించిన ఇందులోని కాక్‌పిట్ కంట్రోల్, సీమ్‌లెస్ కనెక్టివిటీ, విజువల్లీ రిచ్ ఇంటర్‌ఫేస్‌ను అందించడానికి ఉపయోగపడుతుంది.
వోక్స్‌వ్యాగన్ తన ఐడీఏ వాయిస్ అసిస్టెంట్‌ను టిగువాన్ ఆర్-లైన్‌లో పరిచయం చేస్తోంది. ఇది సహజ వాయిస్ ఆదేశాల ద్వారా డ్రైవర్లను కీ ఇన్ఫోటైన్‌మెంట్ ఫంక్షన్లను ఆపరేట్ చేయడానికి సహకరిస్తుంది. ఈ ఎస్వీయూ కొత్త హెడ్స్-అప్ డిస్ప్లే (HUD)తో వస్తోంది.