Nothing Phone 3
Nothing Phone 3 : కొత్త నథింగ్ ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే నెలలో భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 3 లాంచ్ కానుంది. రెండేళ్ల విరామం తర్వాత నథింగ్ ఈ కొత్త ఫోన్ (Nothing Phone 3) తీసుకొస్తోంది. రాబోయే నథింగ్ ఫోన్ 3 ఏఐ ఫీచర్లు, డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 3 సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ బదులుగా కొత్త డాట్ మ్యాట్రిక్స్-స్టయిల్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చు. నథింగ్ ఫోన్ 3 ప్రాసెసర్, డిస్‌ప్లే, ధర వంటి వివరాలను ఓసారి వివరంగా పరిశీలిద్దాం.
నథింగ్ ఫోన్ 3 లాంచ్ తేదీ :
జూలై 1న భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 3 లాంచ్ కానుంది. మీరు యూట్యూబ్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాత్రి 10:30 గంటలకు నథింగ్ ఫోన్ 3 లాంచ్ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
నథింగ్ ఫోన్ 3 మోడల్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3వేల నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల ఫ్లాట్ అమోల్డ్ ఎల్టీపీఓ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. హుడ్ కింద, నథింగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 12GB వరకు ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. నథింగ్ ఫోన్ 3 మోడల్ 5,000mAh బ్యాటరీతో 50W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఆండ్రాయిడ్ 16-ఆధారిత NothingOS 4 రన్ కానుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో రావచ్చు. కెమెరాల విషయానికొస్తే.. నథింగ్ ఫోన్ 3 బ్యాక్ సైడ్ ట్రిపుల్ 50MP సెటప్‌ను కలిగి ఉండనుంది. మెయిన్, అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన టెలిఫోటో సెన్సార్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉండవచ్చు.
నథింగ్ ఫోన్ 3 ధర (అంచనా) :
నథింగ్ ఫోన్ 3 బేస్ మోడల్ ధర 799 డాలర్లు (సుమారు రూ. 68వేలు ) ఉండవచ్చు. 16GB + 512GB వేరియంట్ ధర 899 డాలర్లు (సుమారు రూ. 77వేలు) ఉండవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.