Nothing Phone 3 Price : భలే ఆఫర్ గురూ.. ఈ నథింగ్ ఫోన్ 3 సగం ధరకే.. అమెజాన్‌లో ఇలా కొనేసుకోండి..!

Nothing Phone 3 Price : నథింగ్ ఫోన్ 3 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

1/6Nothing Phone 3 Price
Nothing Phone 3 Price : కొత్త ఫోన్ కొంటున్నారా? నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. అమెజాన్ ఇండియాలో రూ.30వేల భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. నథింగ్ ఫోన్ 3 అసలు ప్రారంభ ధర రూ.79,999 ఉంటే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు రూ.49,999 తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై ఇంకా డిస్కౌంట్ పొందాలంటే ఎక్స్ఛేంజ్ డీల్ కూడా ఎంచుకోవచ్చు.
2/6Nothing Phone 3 Price
స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ద్వారా రన్ అయ్యే నథింగ్ ఫోన్ 3 మోడల్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నవారికి అద్భుతమైన ఆప్షన్. మీరు ఎప్పుడైనా మిడ్ రేంజ్ ధరకు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఇంతకీ అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 తగ్గింపు ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
3/6Nothing Phone 3 Price
అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ : ప్రస్తుతం అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 మోడల్ రూ.49,999కి లభిస్తోంది. అసలు ప్రారంభ ధర రూ.79,999 నుంచి రూ.30వేలు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం DBS, స్కాపియా ఫెడరల్ బ్యాంక్ లేదా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.1,500 తగ్గింపును కూడా అందిస్తోంది.
4/6Nothing Phone 3 Price
నథింగ్ ఫోన్ 3 ధర రూ.48,499కి తగ్గింది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మీరు ఈజీగా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. బ్రాండ్, కండిషన్ మోడల్‌ బట్టి గరిష్టంగా రూ.44,250 వరకు తగ్గింపు పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ.2,424 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. వడ్డీ లేకుండా కొన్ని నెలలు పేమెంట్ చేసుకోవచ్చు.
5/6Nothing Phone 3 Price
నథింగ్ ఫోన్ 3 స్పెషిఫికేషన్లు : నథింగ్ ఫోన్ 3 మోడల్ 6.67-అంగుళాల OLED స్క్రీన్‌, HDR10+ సపోర్ట్‌తో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. చాలా ఫ్లూయిడ్ ఇమేజ్‌లను అందిస్తుంది. ఈ స్క్రీన్ 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ రేటింగ్‌ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ నథింగ్ ఫోన్ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
6/6Nothing Phone 3 Price
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4 ప్రాసెసర్ ద్వారా పొందవచ్చు. కెమెరా పరంగా పరిశీలిస్తే.. నథింగ్ ఫోన్ 3 మోడల్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. ఇందులో ప్రైమరీ కెమెరా, పెరిస్కోప్ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి.