ఇదేంది భయ్యా.. ఫీచర్లు ఇంత అద్భుతంగా ఉన్నాయి.. Nothing Phone 3 మామూలుగా లేదుగా..

బ్యాటరీ సామర్థ్యం 5,000mAh లేదా 5,300mAh ఉండొచ్చు.

ఇదేంది భయ్యా.. ఫీచర్లు ఇంత అద్భుతంగా ఉన్నాయి.. Nothing Phone 3 మామూలుగా లేదుగా..

Updated On : May 2, 2025 / 2:47 PM IST

నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ఆ కంపెనీ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటికే నథింగ్‌ నుంచి ఫోన్ 3ఏ, 3ఏ ప్రో స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు నథింగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల దృష్టి నథింగ్ ఫోన్ 3పై ఉంది.

ఫోన్ 3 ఫీచర్లపై ఆ కంపెనీ అధికారికంగా వివరాలు తెలపనప్పటికీ లీక్‌ల ద్వారా పలు ఫీచర్ల గురించి తెలిసింది. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అంచనా. అంటే ఇది జులై, సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా లాంచ్‌ కావచ్చు.

Also Read: OnePlus 13s స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోందీ… ఫోన్‌ అంటే ఇలా ఉండాలి అనేలా..

నథింగ్ ఫోన్ 3 ధర?
భారత్‌లో నథింగ్ ఫోన్ 3 ధర రూ.45,000 – రూ.50,000 మధ్య ఉండవచ్చని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న నథింగ్ ఫోన్‌ 3 ధర రూ.44,999.

ఫీచర్లు
ఫోన్ 3 డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల AMOLED LTPO స్క్రీన్‌తో ఉంటుంది. ఫోన్ 3 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ ద్వారా రన్ అవుతుంది. 12GB వరకు RAM, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రావచ్చు.

బ్యాటరీ సామర్థ్యం 5,000mAh లేదా 5,300mAh ఉండొచ్చు. 50W ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఉంటుంది. కస్టమ్ ఏఐ అసిస్టెంట్ కూడా ఇందులో ఉండొచ్చు. ఫొటోగ్రఫీ కోసం నథింగ్ ఫోన్ 3లో మూడు 50MP బ్యాక్‌ కెమెరాలు ఉండవచ్చు. ప్రధాన లెన్స్, అల్ట్రావైడ్, టెలిఫొటో సెన్సార్‌తో రావచ్చు. 32MP సెల్ఫీ కెమెరాను ఉండే అవకాశం ఉంది.