Ola Electric Announces 10 Colour Options For E Scooters
Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు 2021, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ చేసుకున్న వారికి స్కూటర్లను మొదట అందజేయనున్నారు. వారంతా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి బైక్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం సొమ్ము చెల్లించి లేదా ఈఎంఐ (EMI) పద్దతిలో స్కూటర్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ కల్పించేందుకు పలు బ్యాంకులతో ఓలా సంస్థ ఒప్పందం చేసుకుంది.
Read More : Ola : అక్టోబర్ నెలలో ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్.. రుణాలు అందించేందుకు బ్యాంకులు రెడీ!
ఈ స్కూటర్ కనీస ఈఎంఐ 2 వేల 9 వందల 99 రూపాయలుగా నిర్ణయించారు. బుధవారం నుంచి కొనుగోలు చేసిన వారికి అక్టోబరులో డెలివరీ ఇస్తామని ఓలా కంపెనీ తెలిపింది. షోరూం వ్యవస్థ లేనందున నేరుగా కస్టమర్ల ఇంటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తాయని ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగు పెడుతున్న ఓలా స్కూటర్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. లక్షకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించింది. మరోవైపు ఆటోమొబైల్ ఇండస్ట్రీని చిప్‌ల కొరత వేధిస్తోంది. దీంతో బైక్‌ను కొనుగోలు చేసే సమయంలోనే డెలివరీ ఎప్పుడిస్తామనే వివరాలు కస్టమర్‌కి వెల్లడిస్తామని ఓలా ప్రతినిధులు తెలిపారు.
Read More : Ola Electric Scooters : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీసింగ్.. ఎక్కడ? ఎప్పుడు.. రిపేర్ ఎలానంటే?
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎస్ 1, ఎస్ 1 ప్రో వేరియంట్లలో అందిస్తున్నారు. వీటిలో 8.5 కిలోవాట్ మోటార్, 3.97 కిలోవాట్ పర్ అవర్ బ్యాటరీని అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్లుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. కేవలం మూడు సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. ఇందులో ఎస్ 1 ధర 99 వేల 9 వందల 99 రూపాయులు ఉంది. ఎస్ 1 ప్రో ధర ఒక లక్షా 29 వేలుగా నిర్ణయించారు.