Ola : అక్టోబర్ నెలలో ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్.. రుణాలు అందించేందుకు బ్యాంకులు రెడీ!

స్కూటర్లు సెప్టెంబర్ 08వ తేదీ నుంచి కొనుగోలు కోసం అందుబాటులో ఉండే విధంగా ప్లాన్స్ చేస్తున్నారు. కానీ..డెలివరీలు మాత్రేం అక్టోబర్ లో స్టార్ట్ చేస్తామని ఓలా కంపెనీ వెల్లడించింది.

Ola : అక్టోబర్ నెలలో ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్.. రుణాలు అందించేందుకు బ్యాంకులు రెడీ!

Ola

Ola E-Scooters : పెట్రోల్ ధరలు పెరుగుతుండడం, వాయు కాలుష్యం మూలంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భవిష్యత్ లో ఫుల్ డిమాండ్ ఉంటుందని ముందుగానే కంపెనీలు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో ‘ఓలా’ ఒకటి. జులై నెలలో ప్రీ లాంగ్ బుకింగ్ లను రూ. 499లకు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా బుకింగ్ ప్రకటించిందో..లేదో 24 గంటల్లో…లక్ష ఆర్డర్ లు వచ్చి పడ్డాయి. ఈ స్కూటర్ మార్కెట్ లోకి డెలివరీ కానప్పటికీ…లాంఛనంగా అయితే..ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైంది. ఈ స్కూటర్లు సెప్టెంబర్ 08వ తేదీ నుంచి కొనుగోలు కోసం అందుబాటులో ఉండే విధంగా ప్లాన్స్ చేస్తున్నారు. కానీ..డెలివరీలు మాత్రేం అక్టోబర్ లో స్టార్ట్ చేస్తామని ఓలా కంపెనీ వెల్లడించింది.

ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్ 1 స్కూటర్ కొనుక్కోవాలని అనుకుంటున్న వారికి రుణాలు అందించడానికి పలు బ్యాంకులు..ఆర్థిక సంస్థలతో ఓ అవగాహనకు వచ్చాయి. హెచ్ డిఎఫ్ సీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా ప్రైమ్, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంకు, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పాటు..ఇతర ఆర్థిక సంస్థలు ఫైనాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. కంపెనీ ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 2 ట్రిమ్ లలో ఎస్ 1, ఎస్ 1 వరుసగా రూ. 99, 999, రూ. 1,29,999 ధర నిర్ణయించింది.

బ్యాంకులతో ఒప్పందం తర్వాత..స్కూటర్ ఫైనాన్సింగ్ ను ఎంచుకోవాలని అనుకొనే వారికి ‘ఏ బ్యాంక్’ అనే ఆప్షన్ అందించబడుతుందని, లోన్ ఆమోదం తర్వాతే..స్కూటర్ డెలివరీ జరుగుతుందని కంపెనీ వెల్లడించింది. రుణ ఈఎమ్ఐ కేవలం రూ. 2,999 నుంచి ప్రారంభం అవుతుందని, మొత్తం ఈ ప్రక్రియ అంతా..ఆన్ లైన్ లోనే జరుగుతుందని తెలిపింది. కొనుగోలుదారులు తగిన మొత్తాన్ని చెల్లించి (సెప్టెంబర్ 08 నుంచి రిజర్వ్ చేసుకున్న వారు)…వాహన వేరియంట్ రంగు ఎంపికలను ఖరారు చేసుకోవచ్చని వెల్లడించింది.

Ola Electric Scooter Buyers To Get Home Delivery Across India

Read More : Ola Electric Scooters : ఓలా ఈ-స్కూటర్ వచ్చేసింది…అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటేఅక్టోబర్ నెల నుంచి స్కూటర్లు ఇంటి వద్దకే డెలివరీ చేస్తామంది. ఓలా ఎస్ 1 లో 8.5 కేడబ్ల్యూ మోటర్, 3.97 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లతో 10 రంగుల్లో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 500 ఎకరాల స్థలంలో విస్తరించి…తయారీ కర్మాగారం ఏర్పాటు చేసింది. మొదటి దశలో 10 లక్షల స్కూటర్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. పర్యావరణాన్ని కాపాడే ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, రాయితీలు, సబ్సిడీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మార్కెట్ లో రిలీజ్ అయిన తర్వాత..ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.