Ola Electric Scooters : ఓలా ఈ-స్కూటర్ వచ్చేసింది…అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓలా ఈ-స్కూటర్ వచ్చేసింది. ఎస్-1, ఎస్-1ప్రో అనే రెండు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Ola Electric Scooters : ఓలా ఈ-స్కూటర్ వచ్చేసింది…అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే

Ola Electric Scooters

Ola Electric Scooters : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓలా ఈ-స్కూటర్ వచ్చేసింది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఓలా తన ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. రివర్స్ మోడ్ లో వస్తున్న కొన్ని ద్విచక్రవాహనాల్లో ఇదొకటి. అంటే ఓలా స్కూటర్లు ముందుకే కాదు వెనుకకూ ప్రయాణించగలవు.

స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌తో ఓలా స్కూటర్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఓలా ఎస్ 1 స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 121 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అదే ఎస్ 1 ప్రొ విషయానికి వస్తే 181 కి.మీ ప్రయాణించవచ్చు. గరిష్టంగా 115 కిమీ వేగం అందుకోగలదు. 3 సెకన్లలో 40 కిమీ, 5 సెకన్లలో 60 కిమీ వేగం అందుకోగలదు. ఎస్1 ప్రో 4 గంటల 48 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. అదే ఎస్1 వేరియంట్ కు 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. నార్మల్‌, స్పోర్ట్‌, హైపర్‌ అనే మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి.

ఎస్1 ప్రారంభ ధర రూ.99వేల 999. ఎస్1 ప్రో ధర రూ.1,29,999. ఫేమ్ రాయితీ కింద ఈ ధర మరింత తగ్గనుంది. మొత్తం 10 రంగుల్లో ఈ స్కూటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రొపరైటరీ బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ కలిగి ఉంది. బ్యాటరీని నిత్యం మానిటర్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీ డ్యూరబులిటీ, పెర్ఫార్మన్స్, రేంజ్, భద్రతను మానిటర్ చేస్తుంది. దీనికి ఎలాంటి కీ ఉండదు. స్మార్ట్ ఫోన్ తో ఆన్ అవుతుంది. డిజిటల్ కీ ఫీచర్ కలిగుంది. బండిని పార్క్ చేసి మనం కాస్త దూరం వెళితే చాలు.. ఆటోమేటిక్ గా అదే లాక్ అవుతుంది. మల్టి మైక్రోఫోన్ అర్రే కలదు. 7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే కలదు. బిల్ట్‌ ఇన్‌ స్పీకర్స్‌, స్మార్ట్‌ ఫోన్‌ లాక్‌-అన్‌లాక్‌, జియో ఫెన్సింగ్, ఆన్‌బోర్డ్ నేవిగేషన్, సైడ్ స్టాండ్ అలర్ట్, యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్కూటర్‌లో 3 జీబీ ర్యామ్‌ ఆక్టాకోర్‌ చిప్‌ సెట్‌తో కూడిన ఏడు ఇంచుల స్క్రీన్‌ ఉంటుంది. ‘బిల్ట్‌ ఇన్‌ స్పీకర్ల’తో ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ చూసుకోవచ్చు. సందేశాలు పంపుకోవచ్చు. ఎస్‌1 ప్రో లో 3.97 kWh బ్యాటరీ, ఎస్‌1లో 2.98 kWh బ్యాటరీని పొందుపరిచారు. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇందులో 36 లీటర్ల బూట్‌ స్పేస్‌ లభిస్తుంది.

ఎస్‌1 ప్రారంభ ధర రూ.99,999. ఫేమ్‌, రాష్ట్రాల రాయితీ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. ఢిల్లీలో దీని ధర రూ.85,099, గుజరాత్‌లో రూ.79,999, మహారాష్ట్రలో రూ.94,999, రాజస్థాన్‌లో రూ.89,968గా ఉంది.

ఎస్ 1 ప్రో ప్రారంభ ధర 1,29,999. ఎలక్ట్రిక్ వాహనాల రాయితీ తర్వాత ఢిల్లీలో రూ.1,10,149, గుజరాత్‌లో 1,09,999, మహారాష్ట్రలో రూ.1,24,999, రాజస్థాన్‌లో రూ.1,19,138కి లభిస్తుంది.

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ బుకింగ్‌లో ఓలా ఈ బైక్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కేవలం 24 గంటల్లో దాదాపు వెయ్య నగరాల్లో లక్ష ప్రీ బుకింగ్‌లు వచ్చాయంటే.. ఓలా ఈ బైక్ కున్న క్రేజ్ అర్థమవుతుంది. ఓలా ఈ బైక్ కు లభించిన ఆదరణ చూశాక.. పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ బైక్‌లను విపణిలోకి తెచ్చే పనిలో పడ్డాయి. ఇప్పటికే దిగ్గజ మోటర్ కంపెనీ హీరో ఎలక్ట్రిక్‌ ఈ రంగంలోకి ప్రవేశించింది. అలాగే సింపుల్ వన్ కంపెనీ అప్పుడే ప్రీ బుకింగ్‌ ప్రక్రియను షూరూ చేసింది.