Ola Electric Scooters : ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల స‌ర్వీసింగ్.. ఎక్కడ? ఎప్పుడు.. రిపేర్ ఎలానంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుగోలు చేస్తున్నారు. కానీ, ఏదైనా రిపేర్లు, సర్వీసులు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలి? ఓలా సర్వీసు సెంటర్లు ఎక్కడ ఉంటాయో తెలుసా?

Ola Electric Scooters  : ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల స‌ర్వీసింగ్.. ఎక్కడ? ఎప్పుడు.. రిపేర్ ఎలానంటే?

Ola S1 And S1 Pro Electric Scooters Will Get At Home Service

Ola S1 and S1 Pro electric scooters home service : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కంపెనీలు కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఎల‌క్ట్రిక్ కార్లు ఇప్ప‌టికే భారత మార్కెట్లోకి వచ్చేశాయి. ప్రముఖ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే కొత్తగా Ola S1, S1 Pro స్కూటర్లను లాంచ్ చేసింది. ఆగస్టు 15వ తేదీన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. ఈ కంపెనీ ఇప్పటికే డెలివరీ ప్రాసెస్ కూడా పూర్తి చేసేసింది. కొనుగోలుదారుల ఇంటికే స్కూటర్లను డెలివరీ చేసేందుకు ఓలా ప్లాన్ చేస్తోంది. అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుగోలు చేస్తున్నారు. కానీ, ఏదైనా రిపేర్లు, సర్వీసులు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలి? ఓలా సర్వీసు సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలిసి ఉండాలి.

అందుకే తమ కొనుగోలు దారుల కోసం ఓలా స్కూటర్ సర్వీస్ ఎలా చేయించుకోవాలో సూచనలు చేస్తోంది. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ సర్వీసు కోసం ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఓలా అధికారిక అప్లికేషన్ కూడా ఉంది. Ola Champion అనే ఫీచర్ ద్వారా స్కూటర్ సర్వీసు చేయించుకోవచ్చు.. అలాగే ఎప్పుడూ సర్వీసు చేయించుకోవాల్సి వస్తుందో కూడా అంచనా సమయాన్ని అందిస్తుంది. అప్పుడు టెక్నీషియన్ మీ ఇంటికే వచ్చి సర్వీసింగ్ చేసి వెళ్లిపోతారు.
Simple One Vs Ola: ఇందులో ఏ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ బెస్ట్.. ఏయే ఫీచర్లు బాగున్నాయి

స్కూటర్ డెలివ‌రీ కాగానే.. సర్వీసు కోసం Ola Electric యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ యాప్ నుంచే స్కూట‌ర్‌కు అవసరమైనవి చేయించుకోవాల్సి ఉంటుంది. అదే యాప్‌లో Ola Champion అనే ఫీచ‌ర్ ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా స్కూట‌ర్ స‌ర్వీసింగ్ ఎప్పుడు చేయించుకోవాలో తెలుసుకోవచ్చు. అలాగే స‌ర్వీసింగ్‌ రిక్వెస్ట్ కూడా పెట్టొచ్చు. ఓలా టెక్నిషియన్ ఇంటికే వ‌చ్చి స‌ర్వీసింగ్ చేస్తారు.

ఓలా స్కూట‌ర్‌ స‌ర్వీసింగ్ అల‌ర్ట్స్ ముందుగానే కస్టమర్ రిజిస్టర్డ్ ఫోన్ కు వస్తాయి. యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న కస్టమర్లకు స్కూటర్ సంబంధిత అన్ని అలర్ట్స్ వస్తుంటాయి. స‌ర్వీసింగ్ కోసం స్కూట‌ర్‌ను సర్వీసుకు సెంట‌ర్‌కు తీసుకెళ్లాల్సిన పనిలేదు. మీ ఇంటికే టెక్నిషియ‌న్లు వచ్చి సర్వీసింగ్ చేస్తారు. ఇందుకోసం ఓలా ప్రెడిక్టివ్ AI మెయిన్‌టెనెన్స్‌ను డెవలప్ చేస్తోంది. ఓలా ఎల‌క్ట్రిక్.. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో ఓలా సర్వీసు సెంట‌ర్ల‌ను ఏర్పాటుచేసేందుకు ప్లాన్ చేస్తోంది.